Electricity Charges Huge Increase in YSRCP Government : సీఎం జగన్ పాలనలో సామాన్యులపై పడని భారం లేదు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే అని నిరూపిస్తున్నారు. నాలుగేళ్లుగా విద్యుత్ బిల్లులపై వీర బాదుడు బాదుతున్నారు. ఎప్పుడో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏ అంటూ అర్థం కాని పేర్లతో నిర్దయగా దండుకుంటున్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెల విద్యుత్ బిల్లులు రికార్డు స్థాయికి చేరాయి. జగన్ పాలనలో యూనిట్‌కు.. 3 రెట్లు (3 Times Increase Per Unit) పెరిగింది. ఒక యూనిట్‌కు 19 పైసలుగా ఉన్న ఎఫ్‌పీపీసీఏ మొత్తం జులై నుంచి 63 పైసలకు ప్రభుత్వం పెంచింది. దీంతో జూన్‌లో విద్యుత్ వినియోగంతో పోలిస్తే వ్యత్యాసం లేకున్నా ఛార్జీలు భారీగా పెరిగాయి. పైసల్లో పెంచుతున్నట్లు లెక్కలు చూపుతున్నా వాస్తవానికి నెలకు ప్రజలపై అదనంగా పడే భారం 645 కోట్లు.
People Suffer with Power Cuts and Electricity Bills in AP : ఇంధన సర్దుబాటు ఛార్జీలను యూనిట్‌కు మరో 43 పైసలు పెంచడమే కారణంగా తెలుస్తోంది. ట్రూఅప్, రెండు ఎఫ్‌పీపీసీఏలు కలిపి యూనిట్‌కు 6రూపాయల 50 పైసల వరకు చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చును ట్రూఅప్, ఇంధన ఛార్జీల పేర్లతో వసూలుకు ప్రభుత్వం డిస్కంలకు అనుమతించింది. ఆ ఛార్జీలను కూడా డిస్కంలు ప్రజలపై వేయడం వల్లే ఆగస్టులో ఛార్జీలు పెరిగినట్లు అంచనా.
High Electricity Bill: రెండు ఫ్యాన్లు, బల్బులు.. బిల్లు చూస్తే షాక్
Burden Electricity Bills on People in AP : సాధారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువ. దీని దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎఫ్‌పీపీసీఏ మొత్తాన్ని యూనిట్‌కు 19 పైసల చొప్పున వసూలుకు ప్రభుత్వం అనుమతించింది. వినియోగం ఎక్కువగా ఉన్న సమయంలో యూనిట్‌కు వసూలు చేసే ఎఫ్‌పీపీసీఏ మొత్తం భారం కనిపిస్తుందన్న ఉద్దేశ్యంతో తక్కువ రేటును ప్రభుత్వం ప్రతిపాదించింది. వర్షాకాలం, శీతాకాలాల్లో వినియోగం తగ్గుతుందన్న ఉద్దేశ్యంతో జులై నుంచి యూనిట్‌కు వసూలు చేసే మొత్తాన్ని 3 రెట్లు పెంచింది.
ఛార్జీల పెంపు భారం వినియగదారులకు తెలియకుండా వసూలు చేసుకోవాలని ప్రభుత్వం కుయుక్తులు పన్నింది. కానీ ఈ సారి వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది జులై, ఆగస్టులో కూడా వినియోగం తగ్గలేదు. దీంతో వాడుకున్న కరెంటుకు చెల్లించాల్సిన మొత్తంతో పాటు.. యూనిట్‌కు పెరిగిన ఇంధన సర్దుబాటు ఛార్జీలను కూడా కలపడంతో ఆగస్టులో విద్యుత్ సంస్థలు ఇచ్చే బిల్లుల భారం పెరిగింది. పనికెళ్లొచ్చి సేద తీరుదామని సామాన్యుడు ఫ్యాన్ వేసుకుందామనుకున్నా జంకే పరిస్థితి నెలకొంది. ఒక్క ఫ్యాన్, లైట్‌కు గతంలో 250 రూపాయలు కూడా వచ్చేది కాదు. అలాంటిది ఆగస్టులో ఏకంగా 380 బిల్లు వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
Power Bills Burden: కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా రాష్ట్ర ప్రజలు.. ఇదేం బాదుడన్నా అంటూ ఆవేదన
2021-22లో వినియోగించిన విద్యుత్ ఆధారంగా 3,082.99 కోట్లు... 12 వాయిదాల్లో ఎఫ్‌పీపీసీఏ రూపేణా వసూలు చేసుకోడానికి డిస్కంలకు ప్రభుత్వం అనుమతించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి ఏపీఈఆర్సీ కొన్ని సూచనలు చేసింది. 4 త్రైమాసికాల్లో యూనిట్‌కు ఎంత మొత్తం వసూలు చేయాలనేది ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ప్రతి నెలా ఇంధన సర్దుబాటు 313.39 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం వినియోగదారులపై వేస్తోంది. నిర్దేశించిన టారిఫ్ ప్రకారం పైసాతో సహా బకాయి లేకుండా విద్యుత్ బిల్లు కడుతూనే.. అదనంగా భారం వేస్తే అంతంత మాత్రపు ఆదాయం ఉన్న వారు ఎక్కడి నుంచి తెచ్చి కడతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Power Cuts in Villages : శ్లాబ్ల మార్పు, ట్రూఅప్, ఎఫ్‌పీపీసీఏల పేరుతో ప్రభుత్వం మోపిన భారాలతో విద్యుత్ బిల్లులు భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. అలాగని కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం ఇస్తోందా అంటే అదీ లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రజలను విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Power Cut in Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ కోతలు.. నరకం చూస్తున్న రోగులు..