ETV Bharat / state

Education Syllabus Changes in YSRCP Government: రోజుకో భాష, సిలబస్‌.. గందరగోళంలో విద్యార్థుల భవిష్యత్​ - ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త విద్యా విధానం

Education Syllabus Changes Every Year in YSRCP Government: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్‌.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వం ఏం అమలు చేస్తుందో విద్యార్థులు ఏం చదువుతున్నారో అర్థంకాని పరిస్థితి. విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధికోసం రోజుకో భాష, సిలబస్‌ అంటూ ప్రభుత్వం అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది.

Education_Syllabus_Changes_Every_Year_in_YSRCP_Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 9:16 AM IST

Education Syllabus Changes Every Year in YSRCP Government : సీబీఎస్‌ఈ.. ఐబీ.. టోఫెల్‌.. జర్మన్‌.. స్పానిష్‌.. బైజూస్‌ వీడియోలు.. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం తరగతులు.. ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం అమలుచేస్తున్న సిలబస్‌. కొత్తవాటిని ఎక్కడైనా ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. అక్కడ వచ్చే ఫలితాలను చూసి, నిర్ణయం తీసుకుంటారు. కానీ, విద్యాశాఖలో ఇవేం ఉండవు.

School Education Syllabus Changes in AP : రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 24.3శాతం మంది "క్యాట్‌, రెడ్‌, సన్‌, న్యూ, ఫ్యాన్‌, బస్‌"లాంటి చిన్న పదాలనూ చదవలేకపోతున్నట్లు ఇటీవల అసర్‌ సర్వే బహిర్గతం చేసింది. కానీ ప్రభుత్వం రోజుకో భాష, సిలబస్‌ అంటూ అందర్నీ అయోమయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ బడుల్లో ఒక ఏడాది రాష్ట్ర సిలబస్‌ అమలు చేశారు. తర్వాత సీబీఎస్‌ఈ గొప్పదంటూ దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని కాదని ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ సిలబస్‌ అమలు చేస్తామంటున్నారు. ఈలోపే ఇప్పుడు కొత్త భాషలు తీసుకొచ్చారు.

Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం

Digital Teacher in Government Schools : ప్రభుత్వ బడుల్లో స్పానిష్‌, జర్మన్‌ భాషలు నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ (Praveen Prakash) బుధవారం ప్రకటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) సహాయంతో రూపొందించిన "డిజిటల్‌ టీచర్‌ (Digital Teacher)" సహాయంతో ప్రభుత్వ బడుల్లో ఈ భాషలు నేర్పించేందుకు ఆ దేశాల ఎంబసీ ఉన్నతాధికారులు ఎలీనా పెరేజ్‌, మేనిక్‌ యూజినా, మతియాస్‌ స్థాలేతో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇది కాకుండా విద్యార్థి దశ నుంచే వ్యాపార అంశాలపై అవగాహన కల్పించేందుకు 9-12 తరగతులకు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం అమలు చేయబోతున్నారు. దీనికోసం హాట్‌ మెయిల్‌ వ్యవస్థాపకుడు సబీర్‌ భాటియాతోనూ ప్రభుత్వం చర్చిస్తోంది. ఇవి కాకుండా ఇప్పటికే టోఫెల్‌ అమలు చేస్తున్నారు. మరోపక్క బైజూస్‌ (Byju's) కంటెంట్‌ను చూడాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు.
New Education System in Andhra Pradesh: ఉన్నతాధికారులు సైతం ఏం అమలు చేస్తున్నామో తమకే తెలియదని చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒక్క ఏడాదిలో ఇన్ని భాషలు, ఇన్ని రకాల సిలబస్‌లు అమలుచేస్తారా.. పేదలకు ఏదో చేస్తున్నామని రాజకీయంగా గొప్పలు చెప్పేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇంతలా అయోమయానికి గురిచేయాలా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

JanaSena Leader Nadendla Manohar Fire on CM Jagan: "విద్య పేరిట సీఎం జగన్ వందల కోట్లు విదేశీ సంస్థలకు దోచిపెడుతున్నారు"

Students Confused on Education System : ఉదయం సీబీఎస్‌ఈ పాఠాలు.. తర్వాత టోఫెల్‌, అనంతరం బైజూస్‌ ట్యాబ్‌ వినియోగం.. కాసేపటికి జర్మన్‌, స్పానిష్‌ భాషలను నేర్చుకోవడం.. మరికొంత సమయం గడిచాక ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావాలి. ఎప్పుడైనా మధ్యలో సమయం దొరికితే పాఠం చెప్పేందుకు ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుందేమో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వరు.. వారికి అవగాహన కల్పించరు. రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అంటూ అమలుకు ఆదేశాలు ఇచ్చేయడం.. చివరికి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయడమే పనిగా అధికారులు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

Measures to Teach Spanish and German in Government Schools : స్మార్ట్‌ఫోన్‌ చదువులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అన్ని దేశాలకూ గత జులైలో సూచించింది. మంచి టీచర్లను నియమించకుండా కంప్యూటర్లు, వాటిలో రికార్డు చేసిన పాఠాలు ఇస్తే ఫలితం ఉండదని, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోతే విద్యార్థుల్లో చదువుపై ధ్యాస తగ్గుతుందని హెచ్చరించింది. ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీల్లో టోఫెల్‌ శిక్షణ, జర్మన్‌, స్పానిష్‌ భాషలు నేర్పించేస్తామని, బైజూస్‌ పాఠాలు చెప్పేస్తామని ప్రచారం చేస్తుంది. ఇప్పటికే బైజూస్‌ కంటెంట్‌తో ఇచ్చిన ట్యాబ్‌లను కొందరు విద్యార్థులు యూట్యూబ్‌ వీడియోలకు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి.

రాష్ట్రంలో అస్తవ్యస్తంగా విద్యావ్యవస్థ.. 'ప్రైవేటు' బాటలో విద్యార్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.