ETV Bharat / state

ఈ - స్టాంపులు అక్రమాలకు చెక్​.... అతి త్వరలో అందుబాటులోకి.. - బ్యాంకులోన్లు తనఖాలు అఫిడివిట్లు అగ్రిమెంట్లు

E-Stamp Benefits : నాన్‌ జ్యుడిషియల్ స్టాంపులు ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో లేక ప్రజలు అధిక డబ్బులు చెల్లించి బ్లాక్‌లో కొనాల్సిన పని లేదు. బ్యాంకులో చలానా కట్టడానికి లైన్లలో నిలబడాల్సిన అవసరమూ ఉండదు. స్టాంపుల కృత్రిమ కొరత, అధిక ధరల నేపథ్యంలో ఈ-స్టాంపులు ప్రజలకు కొండంత అండగా మారనున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 3, 2023, 7:30 AM IST

ఈ - స్టాంపులు అక్రమాలకు చెక్​.... అతి త్వరలో అందుబాటులోకి..

E-Stamp Benefits : నాన్ జ్యూడిషియల్ స్టాంపులు గవర్నమెంట్ కార్యాలయాల్లో దొరక్క బ్లాక్​లో అధికంగా డబ్బులు వెచ్చించి కొనాల్సిన పని ఇక ఉండదు. బ్యాంకులో చలానా కట్టడానికి క్యూ కట్టాల్సిన అవసరమూ లేదు. స్టాంపుల కృత్రిమ కొరత, అధిక ధరల దండా నేపథ్యంలో ఈ-స్టాంపులు కొండంత అండగా మారనున్నాయి. మరో రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం ఈ స్టాంపు విధానంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టాంపుల విధానం ప్రత్యేకతలేంటీ, ఈ స్టాంపులకు సంబంధించిన మరిన్ని సేవలు ప్రజలకు ఎప్పటిలో అందుబాటులోకి రానున్నాయన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

చాలా మంది బ్యాంకులోన్లు, తనఖాలు, అఫిడివిట్లు, అగ్రిమెంట్లు వంటి వాటికోసం నాన్ జ్యూడిషియల్ స్టాంపులను అధిక మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకుండా ఈ స్టాంపు విధానాన్ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిపై అవగాహన లేని వారు ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకోవడానికి, అఫిడవిట్లు వంటివి ఇవ్వడానికి, రుణ అగ్రిమెంట్లు వంటి లావాదేవీలకి నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపర్ల పైనే ఆధారపడుతున్నారు. ఈ-స్టాంపుల సేవలు ఇప్పటికే కామన్ సర్వీసు కేంద్రాల్లో అందుబాలోకి వచ్చాయి. ఈ విషయంపై అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ-స్టాంపులు నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ పారదర్శకం. తప్పుడు స్టాంపు పేపర్లు సృష్టించడానికి, తప్పుడు తేదీలతో ధృవ పత్రాలు తయారు చేయడానికి అవకాశాలు తక్కువ. ఈ-స్టాంపుల సేవలు కామన్ సర్వీసు కేంద్రాల్లో సైతం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు మరింత మేలు చేకూరనుంది.

నాన్ జ్యూడిషియల్ స్టాంపుల్ పేపర్ల కంటే ఈ స్టాంపుల ద్వారా పని మరింత సులభమవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ-స్టాంపులో బార్ కోడ్, తీసుకున్న వారి పేరు కరెన్సీలో రహస్యంగా ఎలా ఫ్రింట్ అవుతుందో ఈ-స్టాంపుల్లోనూ ఆలాగే అవుతుందని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ అధికారులు తెలిపారు. ఈ-స్టాంపులను పొందేవారి పేర్లను పెన్ తో రాయాల్సిన పని లేదని, అంతా డిజిటలైజ్ పద్దతిలో రికార్డు అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు నాన్ జ్యూడీషియల్ స్టాంపుల కృత్రిమ కొరత సృష్టించి అధిక లాభాలు సంపాదించిన వారికి ఈ-స్టాంపు విధానం చెంప్పపెట్టు కానుంది. మరో రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

తప్పుడు స్టాంపు పేపర్లు సృష్టించడానికి, తప్పుడు తేదీలు సృష్టించడానికి ఈ-స్టాంపులు విధానంలో ఆస్కారం ఉండదని అధికారులంటున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.