Drainage System Worst in Vijayawada: విజయవాడ నగరంలోని చాలా ప్రాంతాల్లో మురుగు కాలువల్లో నీరు నిలిచిపోతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అన్నీ కలిపి 1237 ఓపెన్ డ్రెయిన్లు ఉన్నాయి. 14వ డివిజన్‌లోని అవుట్ ఫాల్ డ్రెయిన్ ప్రమాదకరంగా మారింది. మొగల్రాజపురం నుంచి పెద్ద మొత్తంలో వచ్చే మురుగుతోపాటు గాయత్రీనగర్, ఎన్టీఆర్ సర్కిల్ పరిసర ప్రాంతాలు, దర్శిపేట, నెల్లూరివారి కాలనీ, అంబేడ్కర్ నగర్ కాలనీల్లోని నివాసాల నుంచి విడుదలయ్యే మురుగు నీరంతా అవుట్ ఫాల్ డ్రైయిన్ ద్వారానే బందరు కాలువలోకి వెళ్తుంది.
People Facing Problems with Drainage: దీంతో దర్శిపేట కూడలి నుంచి బందరు కాలువ వరకు 1.3 కిలోమీటర్లు డ్రైనేజీ పలుచోట్ల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ప్రారంభంలో 8 అడుగుల లోతున్న డ్రెయిన్... అంబేడ్కర్ నగర్ నుంచి బందరు కాలువలో కలిసే ప్రాంతంలో 15 అడుగులకు చేరుతోంది. మురుగు, దోమలు, ఈగల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు.
Temaplle Villagers Problems: ఏడాదైనా తీరని తెంపల్లి తంటాలు.. నాటికీ నేటికీ అదే మురుగు..అదే కంపు!
మురుగు కాలువల్లో రోజుల తరబడి పూడిక తీయకపోవడంతో దోమలు, ఈగలు ఎక్కువగా వచ్చి చేరుతున్నాయి. కొద్ది నెలల క్రితం విజయవాడ గురునానక్ కాలనీలో ఐదేళ్ల బాలుడు ఓపెన్ కాలువలో పడి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కూడా వీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు మేలుకోలేదు. నేటికీ ఓపెన్ డ్రెయిన్లపై నగరపాలక సంస్థ అధికారులు మూతలు ఏర్పాటు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో వరద నీటి కాలువ పనులు చేపట్టిన సంస్థకు వైసీపీ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో గుత్తేదారు పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి చేపట్టిన పనులు నిలిచిపోయాయి. దర్శిపేట నుంచి డీమార్ట్ మీదుగా బందరు కాలువలో కలిపేందుకు అవుట్ ఫాల్ డ్రెయిన్ నిర్మాణానికి నగరపాలక సంస్థ 98 లక్షలతో అంచనా తయారుచేసింది.
Drainage Problems in Nellore: బాబోయ్ మురుగు.. ఉండలేకపోతున్నామంటున్న నెల్లూరు వాసులు
ఈ కాలువ పనుల కోసం ఇప్పటికి పదిసార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. జులై 31న వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రెండు అంచనాలుగా చేసి టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేటికీ కాలువ పనులు చేపట్టకపోవటంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
"వర్షాకాలం కారణంగా ఈ డ్రైనేజీ పొంగి దేవాలయం ముందు వరకూ నీళ్లు వస్తున్నాయి. ప్రసాదం పంపిణీ చేసేటప్పుడు దుర్వాసన కారణంగా ఇక్కడకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఏదైనా పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం". - స్థానికుడు
"వర్షం వస్తే.. రోడ్డు మీదకు మురుగు నీరు వస్తుంది. అదే విధంగా దోమలు, ఈగల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. డ్రైనేజీలకు మూతలు లేకపోవడం వలన.. చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది". - స్థానికురాలు