DGP Orders On Deputation Transfers In AP: డిప్యుటేషన్, అటాచ్మెంట్లపై ఐదేళ్లకు పైబడి పని చేస్తున్న పోలీసులను సొంత యూనిట్లకు పంపాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేసిన వారిని తక్షణమే మాతృ యూనిట్‌కు పంపాల్సిందిగా మెమో జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు, యూనిట్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల ఎస్ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకూ ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కారణంగా అవినీతి, పక్షపాతం, నేతలతో కుమ్మక్కవ్వటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు వెలుగు చూస్తున్నాయని డీజీపీ కార్యాలయం ఆ మెమోలో పేర్కొంది.
ఏపీఎస్పీ, ఏఆర్, సివిల్ ఇలా అన్ని విభాగాల్లోనూ డిప్యుటేషన్, అటాచ్మెంట్లపై పని చేస్తున్నవారు ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి వ్యవహారాల వల్ల జూనియర్లకు పదోన్నతులు కల్పించటం కష్టతరం అవుతోందని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి