అక్షయ తృతీయ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ అధికారులు బంగారు ఆభరణాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా యనమలకుదురులోని ఓ జ్యుయలరీ షాపులో నాణ్యత లేని తూకం పరికరం వినియోగిస్తున్నారని గుర్తించి... సీజ్ చేశారు. వినియోగదారులు బంగారం కొనేటప్పుడు ఆభరణాల నాణ్యతను తప్పనిసరిగా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు . తూనికల్లో అక్రమాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డా: ఎంపీ రఘురామ