ETV Bharat / state

CPI: జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే భాస్కర్‌రెడ్డి అరెస్ట్​పై స్పందించాలి: సీపీఐ రామకృష్ణ - CPI reacted to Bhaskar Reddy arrest

Viveka's murder case: వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్​కు నాలుగేళ్ల కాలయాపన జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే దిల్లీకి వెళ్లి ప్రాథేయపడటం వల్లే ఆలస్యమైందని ఆరోపించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Viveka murder case
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Apr 16, 2023, 6:00 PM IST

Updated : Apr 17, 2023, 6:32 AM IST

CPI Ramakrishna reacted to Bhaskar Reddy arrest: వివేకా హత్యకేసుపై సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ భాస్కర్​రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికైనా స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో నాలుగేళ్ల కాలయాపన అనంతరం వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందన్నారు. ఈ కేసు పురోగతి సాధించడంలో సీబీఐకి నాలుగేళ్లు పట్టిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో... ఆయన శవానికి కట్లుకట్టి, సహజ మరణంగా ఎవరు చిత్రీకరించాలనుకున్నారో... అన్ని విషయాల గురించి అక్కడ అందరికీ తెలుసు. పోలీసుల దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాను ప్రాథేయపడి, ప్రసన్నం చేసుకోవడంవల్లే ఈ కేసు పురోగతి నెమ్మదించి, ఇన్నాళ్లు పట్టిందన్నారు. సీబీఐ వారు ఈ నెలాఖరులోపు ఈ కేసును పూర్తిచేసి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ ఆలస్యంగానైనా అరెస్ట్ చేసింది. సీబీఐ నాలుగు సంవత్సరాల పాటు కాలయాపన చేసినప్పటికీ, వైఎస్ భాస్కర్​రెడ్డిని చివరకు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పదేపదే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమితాను ప్రాథేయపడి ప్రసన్నం చేసుకోవడంవల్లే ఈ కేసు పురోగతి నెమ్మదించింది. నేడు సీబీఐ అధికారులు ఎట్టకేలకు భాస్కరరెడ్డిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అంశంపై వెంటనే స్పందించాలి. వివేకా హత్యకేసులు అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

సీపీఎం, సీపీఐ ప్రచార భేరి: బీజేపీని గద్దె దించండి మన దేశాన్ని కాపాడండి అంటూ సీపీఎం, సీపీఐ ప్రచార భేరిలో పిలుపునిచ్చాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. కేవలం బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బడా పెట్టుబడిదారులకు లాభాలు ప్రజలపై భారాలు వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వంటగ్యాస్ 400 రూపాయలు ఉండేదని, నేడు 1200 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయటం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టటం మన దేశ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడుతున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారని ఇరుపార్టీల నేతలు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 17, 2023, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.