ETV Bharat / state

గ్యాస్​ ధరలను వెంటనే తగ్గించాలి.. లేదంటే కేంద్రాన్ని గద్దె దించుతాం : వామపక్షాలు - ఎన్టీఆర్​ జిల్లా

LPG Cylinder Price : పెంచిన గ్యాస్​ ధరలపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగాయి. పెంచిన గ్యాస్​ ధరలను తగ్గించాలని వామపక్షాల పార్టీలు డిమాండ్​ చేశాయి. ఇలా గ్యాస్​ ధరలు పెంచుకుంటూ పోతే గ్యాస్​ వినయోగానికి దూరంగా ఉండాల్సి వస్తుందని గృహిణిలు వాపోతున్నారు.

LPG Cylinder Price
LPG Cylinder Price
author img

By

Published : Mar 2, 2023, 2:21 PM IST

AP Wide Agitations due to Gas Cylinder Price Hike : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎంలతో పాటు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగాయి. పెంచిన ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని వామపక్షాలతో పాటు, ప్రజా సంఘాలు డిమాండ్​ చేశాయి. పెంచిన గ్యాస్​ ధరలు ప్రజలకు భారంగా మారాయని పెర్కోన్నాయి.

ఎన్టీఆర్​ జిల్లాలో ఆందోళన : పెంచిన గ్యాస్​ ధరలను నిరసిస్తూ జిల్లాలో సీపీఎం అధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్యాస్​ ధరల పెంపకాన్ని నిరసిస్తూ నందిగామలోని గాంధీ సెంటర్​లో ధర్నా నిర్వహించారు. సీపీఎం డివిజన్​ కార్యదర్శి జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు చనుమోలు సైదులు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఖాసింలు మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్​ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్​ చేశారు.

గ్యాస్​ ధరలను పెంచటం వల్ల సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోందని అన్నారు. గ్యాస్​ ధరలను కేంద్రం తగ్గించకపోతే.. ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. పెట్రోల్​, డీజిల్​ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికంగా పెంచిందని.. ఇలా ప్రతి వస్తువు ధరలు పెంచుకుంటూ పోతే సామన్యులు జీవించటం ఎలా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్​ ధర దాదాపు 800 రూపాయల వరకు పెంచారని అన్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. సీపీఐ, సీపీఏంలతో పాటు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. పెంచిన గ్యాస్​ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశాయి. విజయనగరంలోని రామకృష్ణ నగర్​లో సీపీఐ ఆధ్వర్యంలో​ గృహిణులు గ్యాస్​ సిలిండర్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. వంటగ్యాస్ ఇప్పటికే భారంగా ఉందని.. కేంద్రం అనుసరిస్తున్న తీరు వల్ల గ్యాస్​ సిలిండర్​ను కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించిందని వాపోయారు. ఒక్కసారిగా 50 రూపాయలు పెంచటంతో సామాన్యులు వంటగ్యాస్​ వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాణిజ్య సిలిండర్​ ధరలను అమాంతం పెరగటంతో.. చిన్న చితక వ్యాపారులకు భారంగా మారిందని సీపీఐ నాయకులు పేర్కోన్నారు. సామాన్యులపై అన్ని విధాలుగా భారం మోపుతున్న జీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ​

అసలు గ్యాస్​ ధర ఎంత పెరిగిందంటే : గ్యాస్​ ధరలు తాజాగా మరోసారి పెరిగాయి. వంటగ్యాస్​ ధరలను పెంచుతూ.. పెట్రోలియం సంస్థలు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్​ ధర 50 రూపాయలు, వాణిజ్యపరమైన గ్యాస్​ సిలిండర్​ ధర 350 రూపాయల మేర పెంచుతున్నట్లు వెల్లడించాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.