ETV Bharat / state

ఉద్రిక్తంగా "సోషల్ మీడియా-మహిళలపై దాడి" సెమినార్.. అనుమతించలేదని ఆందోళన - సీఎం భార్యపై ఆరోపణలు

AP Women Commission Seminar on Attacks on Women on Social Media: సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిని ఖండిద్దామంటూ.. "సోషల్ మీడియా-మహిళలపై దాడి" అనే అంశంపై విజయవాడలో హోటల్‌ ఐలాపురంలో మహిళా కమిషన్ సెమినార్‌ నిర్వహించింది. వైసీపీ ప్రజాప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించి, ఇతర రాజకీయ పార్టీలకు అనుమతి లేదంటూ తమను అడ్డుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. సీఎం భార్య కోసం కాకుండా రాష్ట్రంలోని మహిళలందరి సమస్యలపై వర్క్ షాప్ పెట్టాలని ఆయా పార్టీలకు చెందిన మహిళలు ఆరోపించారు. తాము సైతం బాధితులమంటూ తెలుగుదేశం-జనసేన మహిళా నేతలు వెల్లడించారు.

Women's Commission
Women's Commission
author img

By

Published : Jul 5, 2023, 8:41 PM IST

"సోషల్ మీడియా-మహిళలపై దాడి" అనే అంశంపై సెమినార్

Crime against women through social media: "సోషల్ మీడియా-మహిళలపై దాడి" అనే అంశంపై..రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన సదస్సు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ ప్రజాప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించి, ఇతర రాజకీయ పార్టీలకు అనుమతి లేదంటూ తమను అడ్డుకునే చర్యల్ని తెలుగుదేశం, జనసేన మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. సీఎం భార్య కోసం కాకుండా రాష్ట్రంలోని మహిళలందరి సమస్యలపై వర్క్ షాప్ పెట్టాలని మహిళా కమిషన్‌కు విపక్షాలు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చాయి. స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులమంటూ కొందరు నిరసనకు వచ్చిన మహిళల్ని కించపరిచేలా వ్యవహరించడంతో.. వారిపై తెలుగు మహిళలు చెప్పులతో తిరగబడ్డారు.

సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిని ఖండిద్దామంటూ విజయవాడలో హోటల్‌ ఐలాపురంలో మహిళా కమిషన్ సెమినార్‌ నిర్వహించింది. మహిళా నాయకులు, ప్రముఖుల పట్ల సోషల్ మీడియా ధోరణి హద్దులు దాటుతోందని.. వీటిని కట్టడి చేసేందుకే ఈ సెమినార్ నిర్వహిస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్‌ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. సీఎం కుటుంబంలోని మహిళలపైనా సోషల్ మీడియాలో ఉన్మాదంగా వ్యవహరించడం దారుణమన్నారు. అన్ని వర్గాల మహిళలు బాధితులుగా మారుతున్న పరిస్థితిపై అందరూ స్పందించాలని మహిళా కమిషన్ కోరింది. సెమినార్‌లో తమ అభిప్రాయాలు, సూచనలు తెలపాలంటూ వివిధ మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, డ్వాక్రా సంఘాలను కమిషన్ ఆహ్వానించింది. సోషల్ మీడియాలో సీఎం సతీమణే కాదు తాము సైతం బాధితులమంటూ తెలుగుదేశం-జనసేన మహిళా నేతలు సెమినార్‌లో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది.

సెమినార్‌కు వెళ్తున్న తెలుగు మహిళలు, జనసేన నేతల్ని పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. సెమినార్‌కు తమనెలా అడ్డుకుంటారని వివిధ పార్టీల మహిళలు నిలదీశారు. హోటల్ గేటు వద్దే నిరసనకు దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌తో పోలీసులు సంప్రదింపులు జరిపి.. ఇరు పార్టీల నుంచి 8మందిని లోపలికి అనుమతించారు. సమావేశాన్ని రాజకీయం చేయొద్దంటూ మహిళా నేతల్ని వాసిరెడ్డి పద్మ కోరారు. తాము రాజకీయం కోసం రాలేదని.. ఆడబిడ్డలపై దాడులు పెరిగిపోతున్నాయని మహిళా నేతలు.. వాసిరెడ్డి పద్మతో వాగ్వాదానికి దిగారు. నిరసన తెలిపేందుకు వచ్చిన తెలుగు మహిళల పట్ల స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ కొందరు కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎంత డబ్బులిస్తే ఇక్కడికి వచ్చారంటూ ప్రశ్నించడంతో మహిళలు వారిపై దాడికి యత్నించారు.

తమ సమస్యలు మహిళా కమిషన్ వినాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు డిమాండ్ చేశారు. దీంతో సెమినార్ ముగిసే వరకూ హోటల్ బయట ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు మహిళలను అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. అంతకుముందు తెలుగు మహిళలు వస్తారనే అనుమానంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను ముళ్ల కంచెలు, బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. ఎన్టీఆర్ భవన్ వద్దే అడ్డుకునేలా వ్యూహరచన చేశారు. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పిన తెలుగు మహిళలు.. మంగళగిరి మీదుగా విజయవాడలో సెమినార్‌ వద్దకు చేరుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.