ETV Bharat / state

మార్చి నెలాఖరులోగా అంబేడ్కర్​ స్మృతివనం పనులు - CM Jagan review on Smritivanam works

CM Jagan Review: విజయవాడ స్వరాజ్ మైదాన్​లో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహ పీఠంతో కలుపుకుని 206 అడుగుల ఎత్తు వస్తుందని.. మార్చి నెలాఖరుకు విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని.. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

CM Jagan review
CM Jagan review
author img

By

Published : Jan 20, 2023, 7:07 PM IST

CM Jagan review: విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేడ్కర్​ విగ్రహం, స్మృతివనం నిర్మాణం ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని... పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు.. మంత్రులు మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రగతిని అధికారులు వివరించారు.

విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల ఎత్తు వస్తుందని సీఎంకు అధికారులు తెలిపారు. అంబేడ్కర్​ స్మృతివనం ప్రాజెక్టు కోసం రూ.268 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందని, ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ సైతం వస్తుందన్నారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు.

జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలించామన్నారు. దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నామని, కార్లు, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్​ స్మృతి వనానికి వెళ్లే రోడ్లను సుందరీకరిస్తామని అధికారుులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.