ETV Bharat / state

మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు

YSRCP_Incharge_Changes_updates
YSRCP_Incharge_Changes_updates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 1:10 PM IST

Updated : Dec 27, 2023, 5:18 PM IST

12:50 December 27

క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చిస్తోన్న సజ్జల, ధనుంజయరెడ్డి

CM Jagan Ongoing Exercise on YSRCP-Incharge Changes: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మార్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చగా ఇవాళ మరికొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపురావటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Sajjala Ramakrishna Reddy Talks with Ministers, Public Representatives: వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరికొందరి మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపు రావడంతో తరలివెళ్లారు. వారిలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. వీరితోపాటు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్‌, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి ఉష శ్రీచరణ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మంత్రి కొట్టు సత్యనారాయణలు తాడేపల్లికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో ముందుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి సమావేశమై చర్చిస్తున్నారు. చర్చల్లో భాగంగా పోటీ చేసే స్థానాల మార్పులపై మంత్రులు, ప్రజాప్రతినిధులతో ముందుగా చర్చిస్తున్నట్లు సమాచారం. నేతల అభిప్రాయాలు తెలుసుకుని సీఎం జగన్ ఇన్‌ఛార్జిలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. మరో 2 రోజుల్లో మార్చిన ఇన్‌ఛార్జిలతో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్​సీపీ నూతన ఇన్​చార్జ్​లు నియామకం - నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్యకర్తల హుకుం

జాబితాపై కుస్తీ: వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి, బొత్స, మర్రి రాజశేఖర్, అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అభ్యంతరాలను ప్రాంతీయ సమన్వయకర్తలు సీఎంకు వివరిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల రెండో జాబితా సీఎం ఖరారు చేయనున్నట్లు సమాచారం.

11 Constituencies In-charges Changes: వైఎస్సార్సీపీ అధిష్ఠానం డిసెంబర్ 11వ తేదీన 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చిన విషయం తెలిసిందే. అందులో ప్రత్తిపాడు, కొండపి, వేమూరు, తాటికొండ, సంతనూతలపాడు, చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమ, అద్దంకి, మంగళగిరి, గాజువాక నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జిలను నియమించించింది. ఇకపై ఆయా నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను కొత్త ఇన్‌ఛార్జిలు పర్యవేక్షిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధవారం మరోసారి మరికొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపురావటంతో ఈసారి ఎంతమందిని మార్చనున్నారు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వైసీపీలో చిచ్చు రేపిన ఇంఛార్జ్‌‌ల నియామకం - కొనసాగుతున్న రాజీనామాల పరంపర

YCP Workers Unhappy with CM Jagan: వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఒక్కసారిగా 11 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చడంతో ఆ పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేయడంతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇన్‌ఛార్జిల మార్పులకు కసరత్తులు ప్రారంభించింది. 11 సీట్లలో సమన్వయకర్తల మార్పు వెనుక డబ్బు, లాబీయింగ్‌ గట్టిగా పని చేసిందని వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్‌, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి ఉష శ్రీచరణ్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మంత్రి కొట్టు సత్యనారాయణలు తాడేపల్లికి చేరుకోవడంతో ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరినీ నియమించబోతున్నారనే చర్చ మొదలయ్యింది.

గోదావరి జిల్లాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు - సీఎం జగన్​ను కలిసిన ఎమ్మెల్యేలు

Last Updated : Dec 27, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.