ETV Bharat / state

Clap Drivers Wages Problems చెప్పింది ఒకటి.. చేర్చుకున్నాక ఇంతే.. చేతికిచ్చేది కొంతే.. కొన్ని నెలలుగా అదీ లేదు.. చెత్తసేకరణ ఉద్యోగుల జీతం వెతలు - ఏపీ లేటెస్ట్ న్యూస్

Clap Drivers Problems: వాళ్లంతా క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహన రథసారథులు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్త సేకరణ వాహనాలు ప్రతిరోజూ మన వీధిలోకి, ఇంటి వద్దకు రావాల్సిందే.. ఏ ఒక్కరోజు చెత్త సేకరణ వాహనాలు రాకపోయినా, మన ఇంటితో పాటు చుట్టు పక్కలో పరిసరాలు దుర్గంధం భరితంగా మారుతాయి. అలాంటి క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రత్యేక కథనం.

Clap_Auto_Drivers_Problems
చెత్తసేకరణ ఉద్యోగుల జీతం వెతలు
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 3:53 PM IST

Updated : Sep 26, 2023, 7:52 PM IST

Clap Auto Drivers Problems: జగనన్న స్వచ్ఛ సంకల్పం.. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అన్న లక్ష్యంతో 2021 అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 4,097 చెత్త సేకరణ వాహనాలను.. జెండా ఊపి ప్రారంభించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే ఆరోగ్యకర సమాజం రూపొందించగలమని ఊదరగొట్టారు. సేకరించిన చెత్తతో బయో గ్యాస్, వర్మీ కంపోస్టు ఎరువుల తయారు చేస్తామన్నారు. ప్రమాదకరమైన వ్యర్థాల నిర్మూలనకు అధునాతన పరికరాలను వాడుతామన్నారు.

ఇదంతా నాణేనికి ఒక వైపే.. రెండో వైపు రెండో వైపు క్లాప్ ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మున్సిపాలిటీలు, నగరల్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్న లక్ష్యంతో క్లాప్ ఆటో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు గాను సుమారు 65 మున్సిపాలిటీల్లో క్లాప్ ఆటో వ్యవస్థను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. చెత్త సేకరణ బాధ్యత కొన్ని ప్రైవేటు ఏజన్సీలకు అప్పజెప్పింది.

CLAP DRIVERS : తక్కువ వేతనం చెల్లింపుపై క్లాప్​ డ్రైవర్ల ఆవేదన

వారు ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమీ లేకుండా ఆటో డ్రైవర్లను నియమించుకున్నారు. రాష్ట్రంలో సుమారు 3వేల 500మంది క్లాప్ డ్రైవర్లు పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం క్లాప్ ఆటోల్లో డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి కనీసం వేతనాలు అమలు చేయడం లేదు. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వేతనాలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే వేతనాలను కూడా సమయానికి ఇవ్వడం లేదని క్లాప్ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు, ఏజన్సీలకు చెందిన కొంతమంది పెద్దలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు 15వేల నుంచి 18వేల రూపాయల వేతనం ఇస్తామని ఏజన్సీల వారు చెప్పారని, తీరా ఉద్యోగంలో చేరాక కేవలం 10వేల 6వందల రూపాయల వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం తమకు ఇస్తున్న పది వేల ఆరు వందల రూపాయల వేతనం నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో కొంత డబ్బు తీసుకొని తమకు కేవలం 9వేల 270 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. విశాఖపట్నం వంటి నగరాల్లో పని చేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లకు 15వేల రూపాయల వరకు వేతనాలు ఇస్తున్నారు.

వీటితో పాటు అధిక గంటలు పని చేయించుకుంటూ తమకు వారాంతపు సెలవులు మంజూరు చెయ్యడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని జీతాలతో బతుకు వెల్లదీయడం కష్టమవుతుందని వాపోతున్నారు. తమ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం 18వేల 500 వందల రూపాయలను మంజూరు చేయాలని క్లాప్ డ్రైవర్లు కోరుతున్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక్కో క్లాప్ ఆటో డ్రైవరు నుంచి 50వేల నుంచి లక్ష రూపాయలు ఓచర్ పేమెంట్ పేరుతో ప్రైవేటు ఏజన్సీల వారు తీసుకున్నారని క్లాప్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడపలో చెత్త కష్టాలు.. కనీసవేతన డిమాండ్ తో విధులు బహిష్కరిస్తోన్న క్లాప్ డ్రైవర్లు

ఏలూరులో క్లాప్ డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి 9వేల నుంచి 11వేల రూపాయలకు జీతం పెంచారని.. అయితే కొన్ని నెలల తరువాత తిరిగి 9వేల రూపాయలే వేతనం చెల్లిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని క్లాప్ డ్రైవర్లు చెబుతున్నారు. ప్రతి నెల 15వ తేదీ తరువాత తమకు వేతనాలు చెల్లిస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. రాత్రి సమయాల్లోనూ డంపింగ్ యార్డుల వద్ద పని చేస్తుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునే నాథుడే లేడని క్లాప్ డ్రైవర్లు చెబుతున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్య సమస్యల కారణంగానైనా సెలవు పెడితే.. తమకు ఇచ్చే ఆ చాలీచాలని వేతనాల్లో ప్రైవేటు ఏజన్సీ అధికారులు కోత విధుస్తున్నారని క్లాప్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు అవుట్​ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న తమకు క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

డబుల్ డిగ్రీ చేసి.. వీధుల్లో 'చెత్త ఆటో' నడుపుతూ...

Clap Drivers Wages Problems చెప్పింది ఒకటి.. చేర్చుకున్నాక ఇంతే.. చేతికిచ్చేది కొంతే.. కొన్ని నెలలుగా అదీ లేదు.. చెత్తసేకరణ ఉద్యోగుల జీతం వెతలు

Last Updated : Sep 26, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.