Civil Right Association Round Table: మావోయిస్టుల ఏరివేత పేరుతో ఛత్తీస్ ఘడ్ సుక్మా అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలపై ఆర్మీ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పౌర హక్కుల సంఘం నాయకులు అన్నారు. విజయవాడలో పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలపై ఆర్మీ దాడులను ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ.... ఆదివాసీలపై ఆర్మీ దాడులు జీవించే హక్కును హరించడమే అని ఆరోపించారు. ఈ ఘటనలపై దేశంలోని పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు 18 మంది ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ సీడీఆర్ఓ ఆధ్వర్యంలో ఒకటవ తేదీన నిజ నిర్ధారణ చేయడానికి వెళ్ళగా వారిని అడ్డుకోవడం శోచనీయమన్నారు. బాంబింగ్ జరిగిన అటవీ ప్రాంతాలను సందర్శించనీయకుండా తీవ్ర ఆటంకాలు కల్పించడమే కాకుండా ప్రతినిధులను తీసుకువెళ్లిన వాహనాల డ్రైవర్లను బెదిరించి వెనక్కి పంపించారని ఆరోపించారు. దాడులకు వ్యతిరేకంగా ఆదివాసీలు 400 రోజులుగా నిరసనలు తెలుపుతున్న బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా అధికారులు చర్యలు చేపట్టారని మండిపడ్డారు. ఆదివాసి ప్రాంతాల్లో పోలీస్ క్యాంపులు ఎత్తివేసి వారి జీవించే హక్కును కాపాడాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆదివాసీలపై జరుగుతున్న దాడులపై నిజ నిర్ధారణకు 1 వ తేది జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సుక్మా నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన మమల్నీ సాయంత్రం వరకూ పోలీసులు ఎటువెళ్లనీయకుండా చేశారు. ధర్మాలో 3వేలకు పైగా పాల్గోన్నారు. ఆ ధర్నాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. - చిలుకా చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి