ETV Bharat / state

'జగనే ఎందుకు కావాలంటే' నిర్వహణతో ప్రజాధనం దుర్వినియోగం - గవర్నర్​, సీఈసీకి ఫిర్యాదు

Citizen for Democratic Forum Complaint On Why AP Needs Jagan To Governor: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం నిర్వహిస్తున్న 'జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, ప్రభుత్వ అధికారుల్ని, సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ ఫోరం తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ECని కోరింది.

Citizen_for_Democratic_Forum_Complaint_On_Why_AP_Needs_Jagan_To_Governor

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 10:11 AM IST

'జగనే ఎందుకు కావాలంటే' నిర్వహణతో ప్రజాధనం దుర్వినియోగం - గవర్నర్​, సీఈసీకి ఫిర్యాదు

Citizen for Democratic Forum Complaint On Why AP Needs Jagan To Governor : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ 'జగనే ఎందుకు కావాలంటే (Why AP Needs Jagan)' కార్యక్రమానికి ప్రభుత్వ వనరులు, సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ ఫోరం (Citizen for Democratic Forum) తప్పు పట్టింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ భవానీ ప్రసాద్‌ (Justice Bhavani Prasad), ఉపాధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.గోపాలరావు, సీఎఫ్‌డీ కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) గవర్నర్‌కు లేఖ రాశారు. దీనితో పాటు ఓటరు జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సీఎఫ్‌డీ ఫిర్యాదు చేసింది.

బ్యానర్లు కట్టిన ఉద్యోగులు, జెండాలు ఎగరేసిన వాలంటీర్లు - ప్రభుత్వ లాంఛనాలతో వైసీపీ ప్రచార పర్వం

Irregularities in Voter List 2023 in Andhra Pradesh : రాష్ట్రంలో అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తూ, రాజకీయ రంగు పులుముకున్న వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఓటర్ల జాబితా రూపకల్పన వంటి బాధ్యతల్లో కొనసాగించడం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఫల్యంగా సీఎఫ్‌డీ అభిప్రాయపడింది. ఓటరు జాబితాలో గతంలో ఎన్నడూ లేనంతగా అవకతవకలు చోటు చేసుకోవడానికి, తప్పులు దొర్లడానికి ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బందిని వినియోగించడమే కారణమని పేర్కొంది.

Fake Votes in AP : గతంలో ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఇన్ని తప్పులు ఎప్పుడూ దొర్లలేదని గుర్తుచేసింది. ఇప్పటికైనా ఎన్నికల జాబితాల బాధ్యతల నుంచి సచివాలయ సిబ్బందిని తొలగించి, ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులకు అప్పగించాలని ECని కోరింది. ఎన్నికల జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయని ఈ ఏడాది సెప్టెంబరు 8న రాసిన లేఖలో CEO స్వయంగా అంగీకరించారని సీఎఫ్‌డీ పేర్కొంది. వాటిలో కొన్ని తప్పుల్ని మాత్రమే సరిదిద్దారని వివరించింది.

Volunteers Working as YSRCP Activists: వాలంటీర్లను పార్టీ కార్యకర్తల్లా వాడేసుకుంటున్న జగన్.. ఐప్యాక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ..!

AP Voter List 2023 : 'సున్నా'నంబరుతో ఉన్న ఇళ్లు 2,51,767 ఉంటే, వాటిలో 61,374 మాత్రమే సరిదిద్దారని, పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్లు 1,57,939గా నమోదైతే, వాటిలో 21,347 మాత్రమే సరిదిద్దారని పేర్కొంది. సీఈఓ స్వయంగా అంగీకరించిన తప్పుల్ని సరిదిద్దకుండా ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. జాబితాల్లో దొర్లిన తప్పుల్ని సరిదిద్దే బాధ్యతను మళ్లీ నిష్పాక్షికత కొరవడిన సచివాలయ సిబ్బందికే అప్పగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆక్షేపించింది. దురుద్దేశపూరితంగా ఫారం-7 (Form-7) దరఖాస్తులు పెట్టి తొలగించిన ఓట్లన్నింటినీ పునరుద్ధరించాలని సీఎఫ్‌డీ డిమాండ్‌ చేసింది. అధికార పార్టీకి మేలు చేసేందుకు జరిగిన ఓట్ల తొలగింపు కుట్రలో సచివాలయ సిబ్బందిని బాధ్యులుగా పేర్కొంది.

హలో! ఆ రోజు ఓటు వేసి వెళ్తాం - మా ఓటు అాలాగే ఉంచండి! ఓటరు జాబితాలో కావల్సినవారివి, మృతుల పేర్లు మాత్రం కొనసాగుతాయ్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.