Chintamaneni Prabhakar : పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. రేపు చింతమనేని పుట్టినరోజు సందర్బంగా ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఆస్పత్రిలోకి అనుమతించ లేదు. చింతమనేనిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో చింతమనేని చొక్కా చినిగిపోయింది. దీంతో పోలీసులపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం తప్పా అని చింతమనేని ప్రశ్నించారు. హరిరామ జోగయ్య అదే ఆసుపత్రి వద్ద ఉన్నారనే వంకతో తన కార్యక్రమం అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిరామ జోగయ్యను పరామర్శిస్తే తప్పేంటని అన్నారు. ఇప్పటికే తనపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారని.. అన్నింటికీ తెగించే ఉన్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తాత దిగొచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని దుయ్యబట్టారు.
"రామ జోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా నేను ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసాను. నేను వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కడినే వెళ్తనాని అక్కడున్న అధికారులను కోరాను. కారణం లేకుండా అక్కడున్న డీఎస్పీ నన్ను బలవంతగా వ్యాన్ ఎక్కించారు. ఈ క్రమంలో నా చొక్కా చింపేసి.. నాతో దురుసుగా ప్రవర్తించారు." -చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత
ఇవీ చదవండి: