ETV Bharat / state

పతకాల కోసం పాల్లొనలేదు.. పర్యావరణంపై అవగాహన కలిగించడం కోసం వచ్చామ్.. - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Children Are Being Made Aware Of The Environment: పర్యావరణ పరిరక్షణ, జీవజాతుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలాంటి విషయాలను సాధారణంగా చెబితే చాలా మంది చెవికెక్కించుకోరు. అందుకే వివిధ పోస్టర్ల ద్వారా ఇలాంటి సామాజిక అంశాలను వివరిస్తున్నారు విద్యార్థులు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ నిర్వహించిన రాష్ట్రస్థాయి శాస్త్ర సాంకేతిక పోటీల్లో పాల్గొని పలువురు విద్యార్థులు ప్రశంసలు పొందారు.

Exhibition of Kaushal-2022 posters
కౌశల్-2022 పోస్టర్ల ప్రదర్శన
author img

By

Published : Dec 12, 2022, 12:56 PM IST

విజయవాడలో కౌశల్-2022 పోస్టర్ల ప్రదర్శన పోటీలు
Children Are Being Made Aware Of The Environment: వీరంతా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు. విజయవాడలో భారతీయ విజ్ఞాన భారతి, రాష్ట్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్-2022 పోస్టర్ల ప్రదర్శన పోటీలకు వివిధ జిల్లాల నుంచి వీరు హాజయ్యారు. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ సహా.. వాయు, నీటి కాలుష్యాల వల్ల మానవులతో పాటు ఇతర జీవరాశులకు ఎలాంటి నష్టాలు కలుగుతాయన్న విషయాలను ఈ విద్యార్థులు పోస్టర్ల ద్వారా ప్రదర్శించారు.

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఈ అన్ని అంశాలను ఓ ప్రాజెక్ట్ రూపంలో ప్రదర్శించింది. ఇప్పటికే అనేక జీవులు భూమి మీద అంతరించిపోయాయని.. ఇప్పటికైనా మానవుడు మేలుకోకపోతే మరిన్ని జీవులు భూమి మీద లేకుండా పోతాయని అంటోంది. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని, ఇతర జీవాలను హింసిస్తున్నారంటూ ఆమె చేసిన ప్రదర్శనను పలువురు మెచ్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.