ETV Bharat / state

రాయలసీమ రౌడీయిజం ఇక్కడ వద్దు.. రౌడీయిజం పుట్టింది బెజవాడలోనే - కేపీ రావు

Chaos in SAP Meeting: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. మరోసారి వార్తల్లోకెక్కారు. క్రీడాసంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో సమస్యలు ప్రస్తావిస్తే అసభ్య పదజాలంతో దూషించారంటూ.. క్రీడాసంఘాల ప్రతినిధులు వాపోయారు.

SAP Meeting
శాప్ సమావేశం
author img

By

Published : Mar 24, 2023, 12:02 PM IST

Updated : Mar 24, 2023, 12:27 PM IST

Chaos in SAP Meeting: విజయవాడలో క్రీడాసంఘాలతో శాప్ ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంత్రి రోజా హాజరైన ఈ సమావేశంలో శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. అసభ్య పదజాలంతో దూషించారంటూ పలువురు ప్రతినిధులు నిరసనకు దిగారు. కాగా క్రీడాసంఘాల సమస్యలు తెలుసుకొని, అవసరమైన సౌకర్యాలు కల్పనల కోసం అభిప్రాయ సేకరణ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్దికి కావల్సిన మౌళిక సదుపాయాల కల్పన కోసం.. గుర్తింపుతో సంబంధం లేకుండా అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులూ హాజరు కావొచ్చంటూ, శాప్ ఆహ్వానాలను పంపింది. విజయవాడ ఇందిరాగాంధి స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు అధికారులు హజరైయ్యారు. వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో క్రీడా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అదే సమయంలో శాప్‌లోని కొందరు అధికారుల వల్ల.. క్రీడాకారులకు నష్టం జరుగుతోందని రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కేపీ రావు.. తన అభిప్రాయం వెలిబుచ్చారు.

ఈ క్రమంలో కేపీ రావు మాట్లాడుతున్న సమయంలో శాప్ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్థార్థరెడ్డి ‘హూ ఆర్‌ యూ అంటూ గద్దించడంతో.. సమావేశంలో ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దశలో.. సిద్ధార్థరెడ్డి అనుచరగణం కేపీ రావుపై దాడి చేసేందుకు పైకి దూసుకురావడంతో.. ఆగ్రహించిన కేపీ రావు, ఒక్కసారిగా తన నిరసనను వ్యక్తం చేశారు. రాయలసీమ రౌడీయిజం ఇక్కడ చూపించొద్దని, రౌడీయిజం పుట్టిన బెజవాడలోనే రౌడీయిజం చేస్తే ఊరుకోబోమని అని పేర్కొనడంతో.. సిద్దార్ధరెడ్డి మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. బూతులు తిడుతూ.. సిద్థార్థరెడ్డి అనుచరులు దాడికి యత్నించగా ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు దానిని అడ్డుకున్నారని. సిద్దార్థరెడ్డి కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వలేదని వాపోయారు. సమావేశంలో జరిగిన రికార్డులను సీఎం పరిశీలించి సిద్ధార్థరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి రోజా సమక్షంలోనే సిద్ధార్థరెడ్డి విజ్ఞత కోల్పోయి.. తన స్థాయి మరచి ఏం మాట్లాడారో ముఖ్యమంత్రి గుర్తిస్తే చాలని కేపి రావు తెలిపారు. ఇన్ని సంవత్సరాల.. తన క్రీడా జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఉద్రిక్తతను తగ్గించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు ఒలింపిక్‌ సంఘాల ప్రతినిధులైన.. ఆర్​కే పురుషోత్తం, కేపీ రావును సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లాలని మంత్రి రోజా సూచించడంతో.. పరిస్థితి అదుపులోకి వచ్చింది. తాము పిలిచినప్పుడే.. లోపలికి రావాలని అన్నారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని వారిద్దరినీ సముదాయించారు. క్రీడా సంఘాల సమస్యలు చెప్పాలని ఆహ్వానించి, తీరా సమస్యలు ప్రస్తావిస్తే దూషించడం ఏంటని.. పలువురు క్రీడాసంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.

"పురుషోత్తం అనే వ్యక్తి తప్పులు చెప్తూ ఉంటే ఖండించాము. దానికి మంత్రి గారు.. వివాదాలు వద్దు. అభివృద్ధి గురించి మాత్రమే చెప్పండి అన్నారు. తరువాత మేము సరే అన్నాము. నేను మాట్లాడి జీవో నెంబర్ 74 ను సవరించాలని కోరాను". - కేపీ రావు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం

మంత్రి రోజా ముందే అసభ్య పదజాలం.. రెచ్చిపోయిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Mar 24, 2023, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.