ETV Bharat / state

Chandrayaan 3 Soft Landing Success: చంద్రయాన్-3 విజయం.. ఇస్రో శాస్త్రవేత్తలకు పలువురు శుభాకాంక్షలు

Chandrayaan 3 Mission Soft Landing Success: ప్రపంచంలో ఏ దేశం సాధించని అరుదైన ఘనతను భారత్ సొంతం చేసుకుంది​. ఏ దేశం అడుగు పెట్టని చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకుంది. ఈ ఘన విజయాన్ని దేశమంతటా అంగరంగా వైభవంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 8:47 PM IST

Chandrayaan_3_Mission_Soft_Landing_Success

Chandrayaan 3 Mission Soft Landing Success : ప్రపంచంలో ఏ దేశం సాధించని అరుదైన ఘనతను భారత్ సొంతం చేసుకుంది​. ఏ దేశం అడుగు పెట్టని చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​ 3 విజయం (Chandrayaan-3 Lands on The Moon) సాధించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ అడుగుపెట్టగానే శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల యావత్ భారతదేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘన విజయంపై ప్రముఖలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు.

ఇది చారిత్రాత్మక ఘట్టం : గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైందని, బుధవారం చంద్రుని ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రతిష్టాత్మక సంఘటనను ప్రశంసించారు. ఇది చారిత్రాత్మక ఘట్టమని, చంద్రయాన్-3 మిషన్ యొక్క అద్భుత విజయానికి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని, ఇది చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా, నిర్దేశించని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న ఏకైక దేశంగా భారత్‌ను నిలబెట్టిందని అబ్దుల్ నజీర్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను, చంద్రయాన్-3 మిషన్‌తో సంబంధం ఉన్న ప్రతి సభ్యుడిని గవర్నర్ అభినందించారు. వారు అంతరిక్ష చరిత్రను సృష్టించారని, వారి అంకితభావం, కృషి, పట్టుదలతో దేశం మొత్తం గర్విస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Chandrayaan 3 Landed on Moon : జయహో భారత్​.. చంద్రయాన్​ 3 సాఫ్ట్ ల్యాండింగ్​ సక్సెస్

చరిత్రను లిఖించారు : చంద్రయాన్-3 మిషన్ విజయవంతం చేసిన ఇస్రోకు శాస్త్రవేత్తలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ దేశానికి అద్భుతమైన క్షణం అని సీఎం జగన్‌ అన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో చరిత్ర సృష్టించిందని..చాలా సంంతోషంగా ఉందని, గొప్ప స్థాయికి నడిపిస్తూ చరిత్రను లిఖించారని ముఖ్యమంత్రి అన్నారు.

  • An incredible achievement for India!
    On the Chandrayaan-3’s successful soft landing on the moon, I, along with every citizen of India is filled with pride!
    My wishes and congratulations to everyone @isro.
    That this incredible feat was achieved from Sriharikota in our very own… https://t.co/PYQXe8pwj7

    — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక నుంచి ఎవ్వరూ ఆపలేరు : చంద్రుడిపై భారత్ నిలిచి చరిత్ర తిరగరాసిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుుడు అన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ఘనతను సాధించిన ఏకైక అంతరిక్ష సంస్థగా అవతరించినందుకు ఇస్రోకి అభినందనలు తెలియజేశారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కార్యక్రమాన్ని చంద్రునిపైకి తీసుకెళ్లాలనే వారి అచంచలమైన స్ఫూర్తిని, సంకల్పానికి తన వందనం అని అన్నారు. ఇక నుంచి భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరని చంద్రబాబు నాయుుడు తెలిపారు.

  • India is on the moon! 🇮🇳

    We scripted history today! Congratulations to @isro on the successful landing of Chandrayaan on the Moon’s South Pole and becoming the only space organization to achieve this feat. I salute their indomitable spirit and determination to take India's space… pic.twitter.com/bPRzhbEJ8V

    — N Chandrababu Naidu (@ncbn) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Timeline : చంద్రయాన్​ 3 ప్రయాణం సాగిందిలా..

వైఫల్యాలను విజయ సూత్రాలుగా మలచుకున్నారు : ఇస్రో శాస్త్రవేత్తలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ పంపడం ఘన విజయమని.. వైఫల్యాలను విజయ సూత్రాలుగా మలచుకోవడం విశేషమని ఆయన అన్నారు.

చరిత్ర సృష్టించిన భారత శాస్త్రవేత్తలు : చంద్రుని దక్షణ ధృవంపై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకుల ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ఇస్తో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారని అన్నారు. చంద్రుడిపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబందించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుందని తెలిపారు. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించాలని కోరుకుంటున్నాని అన్నారు. 140 కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు శుభాభినందనాలు తెలియజేశారు.

చంద్రయాన్ -3 విజయోత్సవ సంబరాలు : చంద్రయాన్-3 విజయవంతం అవధుల్లేని ఆనందం కలిగించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మన దేశానికి చందమామ అందిన రోజుని తీసుకొచ్చి ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించిందని కొనియాడారు. తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారతదేశం విక్రమ్ ల్యాండర్ దింపి నవశకానికి నాంది పలికిందని ప్రశంసించారు. ఈ అద్భుతమైన విజయానికి కారకులైన ఇస్రో శాస్త్రవేత్తలకు, భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర లో చంద్రయాన్ -3 విజయోత్సవ సంబరాల్లో లోకేశ్ పాల్గొన్నారు.

  • Countless artists have penned lyrics and melodies about taking their beloved to the moon, but it was @isro who turned this dream into reality!

    An immensely proud moment for every Indian!🇮🇳

    Heartfelt congratulations to scientists at @isro on landing Chandrayaan 3 on the southern… pic.twitter.com/Og4EJZLhD6

    — Lokesh Nara (@naralokesh) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Landed on Moon : సాఫ్ట్​ ల్యాండింగ్ సక్సెస్.. చంద్రయాన్​ 3తో లాభాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.