Chandrababu Ra Kadhali Ra Program : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ‘రా కదిలిరా !’ రెండో బహిరంగ సభలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించనున్నారు. కనిగిరిలో నిర్వహించిన తెలుగుదేశం పిలుస్తోంది 'రా కదలిరా' బహిరంగ సభ విజయవంతం కావడంతో ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించే బహిరంగ సభలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు ఉవిళ్లురుతున్నాయి. తిరువూరులో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు ఆచంటలో నిర్వహించే సభలో పాల్గొంటారు. చంద్రబాబు విడుదల తర్వాత తిరువూరులో నిర్వహించబోతున్న మొదటి సభ కావడంతో నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు.
Chandrababu Public Meeting in Tiruvuru : చంద్రబాబు తిరువూరు సభ కోసం దాదాపు 60 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, తెలంగాణా సరిహద్దు ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. పార్టీ అంచనాల ప్రకారం లక్షమంది కార్యకర్తలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం సభ కావడంతో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 60 ఎకరాల్లో సభ వేదిక, కార్యకర్తలు, అభిమానులు ఆశీనులు అయ్యేందుకు 23 ఎకరాలను కేటాయించారు. ఆ మేరకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మరో 20 ఎకరాల్లో వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో వివిధ రకాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.
రా కదలి రా సభ వాయిదా - సీఈసీ బృందాన్ని కలవనున్న బాబు, పవన్
జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలపై టీడీపీ అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఎవరికి వారే సొంత వాహనాలు సమకూర్చుకున్నారు. వేలాది వాహనాలు ప్రదర్శనగా సభస్థలికి తరలిరానున్నాయి. విజయవాడ నగరం నుంచి ద్విచక్ర, కార్ల వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తారు. ఒక్క నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి వేలాది వాహనాలకు అనుమతి తీసుకున్నట్లు సమాచారం. మైలవరం, ఇబ్రహీంపట్నం నుంచి తరలిరానున్నారు. ఆయా నియోజకవర్గ ఇంఛార్జుల ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లనున్నారు.
చిన్న పొరపాటుకు ఐదేళ్ల నరకం- స్వర్ణయుగం కోసం కదలి రావాలని చంద్రబాబు పిలుపు
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ సభకు హజరు కాకూడదని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆయన అనుచరులుగా తిరిగిన కొంతమంది హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బొమ్మసాని సుబ్బారావు, గన్నె నారాయణ ప్రసాద్, వీరిద్దరూ హాజరు కానున్నారు. నందిగామ, తిరువూరు నుంచి కేశినేని అనుచరులు మౌనంగానే ఉన్నారు. తిరువూరు సభ ముగిసిన అనంతరం చంద్రబాబు హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు వెళ్లనున్నారు.