ETV Bharat / state

రాజ్యాంగ విలువల్ని కాపాడుకోకుంటే.. భవిష్యత్తు అంధకారమవుతుంది: చంద్రబాబు - ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

CBN LETTER TO STATE PEOPLE: రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువల్ని కాపాడుకోకుంటే.. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని చంద్రబాబు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు.

CBN LETTER TO STATE PEOPLE
CBN LETTER TO STATE PEOPLE
author img

By

Published : Nov 26, 2022, 1:55 PM IST

Updated : Nov 26, 2022, 10:12 PM IST

CHANDRABABU OPEN LETTER TO PEOPLE : తాము చెప్పిందే రాజ్యాంగమనే గర్వంతో విర్రవీగుతున్న వైసీపీ నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెగించి పోరాడకపోతే వైసీపీ శ్రేణుల అకృత్యాలు ప్రతి ఒక్కరి ఇంటినీ చుట్టుముడతాయని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని.. లేదంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.

‘‘రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా తెదేపా చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలి. సీఎం జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి ఆంబేడ్కర్ రాజ్యాంగం రచించారు. ఏపీలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోంది. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు"-చంద్రబాబు

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన: రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీగా తెదేపా చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి అంబేడ్కర్ రాజ్యాంగం రచించారన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని.. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యాంగ విలువలను పాటించకుండా.. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర భవిష్యత్‌కు ఇది అత్యంత ప్రమాదకరమైన గొడ్డలిపెట్టు: ప్రభుత్వ విధానాలకు సంబంధించి 42 నెలల్లో దాదాపు 330కుపైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతోందన్నారు. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు గాడి తప్పిన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఇది అత్యంత ప్రమాదకరమైన గొడ్డలిపెట్టని.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? ప్రజలంతా ఆలోచన చేయాలి అని చంద్రబాబు లేఖలో కోరారు.

"రాజ్యాంగ విలువలను పాటించడం లేదు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారు"-చంద్రబాబు

ఇవీ చదవండి:

Last Updated : Nov 26, 2022, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.