ACB Court On Lingamaneni Karakatta house: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో నివసిస్తున్న ఇంటిని జప్తు (ఎటాచ్) చేసేందుకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ.. సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చంద్రబాబు ఉంటున్న ఇంటిని జప్తునకు (ఎటాచ్) అనుమతి ఇవ్వాలంటూ తాజాగా ఏపీ సీఐడీ.. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ చేసింది. ఆ పిటిషన్‌పై నేడు వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును జూన్ 2కు వాయిదా వేసింది.
ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జూన్ 2న దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది. రమేష్ ఇంటిని అటాచ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని సీఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం ముందు ఇంటిని అటాచ్ చేయాలని.. దీనికి ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు తమ వాదనలు వినాలని కోరుతూ లింగమనేని రమేష్ తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. ఈనెల 17న ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తమకు కాపీలను అందజేయాలని న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 2కు వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో రాజధాని అమరావతి నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికల ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. అంతేకాకుండా, లంచం/క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారంటూ సీఐడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇంటి జప్తునకు (ఎటాచ్) అనుమతిని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖాలాలు చేసింది. మరోవైపు సీఐడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం రోజు విచారణ జరిగింది. విచారణలో భాగంగా ప్రత్యేక పీపీ వైఎన్ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్‌మెంట్‌కు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ.. న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
CM Jagan: కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు.. నేడు సీఎం జగన్ శంకుస్థాపన