Graduate MLC Elections TDP Candidate Arrest : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డి అరెస్టులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. టీడీపీ అభ్యర్థి గెలిచాడని ముఖ్యమంత్రి అక్కసుతో అక్రమ చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి విజయాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత.. 12 గంటలు గడిచిన డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులు ఉండిపోయారని మండిపడ్డారు. ఎవరి ఒత్తిడి వల్ల అధికారులు చేశారో చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు.
చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం అభ్యర్థి రామగోపాల్ రెడ్డి అక్రమ అరెస్టుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని.. అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేయించిన జగన్ రెడ్డిది ఏం బతుకు అని విమర్శించారు. ఇంతకంటే ముఖ్యమంత్రి ఇంకేం భ్రష్టు పట్టిపోవాల్సింది ఉందని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికలలో పోటీ చేసిన గెలుపొందిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా.. ఒత్తిడి చేసి అడ్డుపడతావా అని సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచాడని అక్కసుతో ఆర్థరాత్రి అరెస్టు చేస్తావా?(1/2) pic.twitter.com/8PDCCskiwi
— N Chandrababu Naidu (@ncbn) March 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచాడని అక్కసుతో ఆర్థరాత్రి అరెస్టు చేస్తావా?(1/2) pic.twitter.com/8PDCCskiwi
— N Chandrababu Naidu (@ncbn) March 19, 2023ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచాడని అక్కసుతో ఆర్థరాత్రి అరెస్టు చేస్తావా?(1/2) pic.twitter.com/8PDCCskiwi
— N Chandrababu Naidu (@ncbn) March 19, 2023
ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు : అనంతపురంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత 12 గంటలు గడిచిన డిక్లరేషన్ ఇవ్వకపోవటం.. దేశ చరిత్రలోనే ఎక్కడా లేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత సైతం.. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని అన్నారు. ఫకీరప్ప ఉద్యోగానికి పనికిరాడని ఆక్షేపించారు. ఎస్పీ ఫకీరప్పను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పద్దతి మార్చుకుంటే కనీసం ఎమ్మెల్యేగానైనా ఉంటారని విమర్శించారు. ఎస్పీ, కలెక్టర్ మీద చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీని స్తంభింపచేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ మొదలైంది: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించిందని టీడీపీ నేత చినరాజప్ప అన్నారు. అంతేకాకుండా పులివెందులలో సైతం టీడీపీ విజయం సాధించిందన్నారు. భూమిరెడ్డి విజయాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. భూమిరెడ్డికి గెలుపు డిక్లరేషన్ వెంటనే ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎవరి ఒత్తిడి వల్ల అధికారులు డిక్లరేషన్ ఆపారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ మెుదలైందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :