ETV Bharat / state

నూతన గవర్నర్​ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసిన చంద్రబాబు

Chandrababu meets AP new Governor: రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్​ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ను చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం నేతల బృందం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది. నేతలందరినీ రాష్ట్ర ప్రథమ పౌరుడికి తెలుగుదేశం అధినేత పరిచయం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలను చంద్రబాబు గవర్నర్ దృష్టి కి తీసుకెళ్లినట్లు సమాచారం.

cbn
babu
author img

By

Published : Feb 23, 2023, 8:38 PM IST

AP new Governor Justice Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో గవర్నర్‌గా రేపు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యలో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్​ను చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం నేతల బృందం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది. సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య తదితరులు గవర్నర్​ను కలిసిన వారిలో ఉన్నారు.

నేతలందరినీ రాష్ట్ర ప్రథమ పౌరుడికి తెలుగుదేశం అధినేత పరిచయం చేశారు. గవర్నర్​గా తాను లెర్నర్ అని... ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటున్నానని నేతలతో జస్టిస్ అబ్దుల్ నజీర్ సరదాగా మాట్లాడారు. నేతలతో పరిచయం అనంతరం చంద్రబాబుతో గవర్నర్‌ విడిగా దాదాపు 40నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై నూతన గవర్నర్​తో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని చంద్రబాబు ఈ మేర గవర్నర్​కు వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

కర్నాటకలో జన్మించిన జస్టిస్‌ నజీర్‌ వివరాలు: జస్టిస్‌ నజీర్‌ 1958 జనవరి 5న కర్నాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయి ప్రాంతంలో జన్మించారు. మూడబిదరిలో నజీర్ అతని బాల్యం కొనసాగింది. స్ఖానిక మహావీర కళాశాలలో బీకాం చేశారు. జస్టిస్‌ నజీర్‌ మంగళూరు కొడియాల్‌బెయిల్‌ ఎస్‌డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 18 నుంచి కర్నాటక హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. జస్టిస్‌ నజీర్‌ 2003 మే 12న కర్నాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబరు 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జనవరి నాలుగో తేదీ వరకు సుప్రీంకోర్టులో సేవలందించారు.

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.