ETV Bharat / state

జగన్‌ పాలనలో మితిమీరిన అప్పు - ముందుంది ముప్పు : కాగ్‌ హెచ్చరిక - ఏపీ అప్పులు

CAG on AP Debts: ఆంధ్రప్రదేశ్‌లో అ అంటే అభివృద్ధి కాదు. అ అంటే అప్పులు. జగనన్న బటన్‌ నొక్కుడు పథకాలకు రాష్ట్రం బలైపోతోంది. పంచడమే తప్ప ఆదాయం పెంచడం లేని వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ అధోపాతాళానికి పడిపోయే రోజులు ఎంత దూరంలోనో లేవు. ఇప్పటికే మొత్తం రుణాలు, చెల్లింపుల భారం 10.20 లక్షల కోట్లు చేరిపోయింది. ఏడాదికి సగటున లక్ష కోట్ల వరకు అధికారిక, అనధికారిక అప్పులు, వడ్డీలు చెల్లించేందుకే వెచ్చించాల్సిన దుర్భర పరిస్థితులు రాబోతున్నాయి. ముందుచూపు ఉన్న పాలకుడు పగ్గాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేసి తప్ప రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి లేదు.

CAG_on_AP_Debts
CAG_on_AP_Debts
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2024, 3:30 PM IST

CAG on AP Debts : ప్రతి మంగళవారం అప్పు పుడితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. జగన్‌ పాలనలో ఏపీ రుణ విష వలయంలో చిక్కుకుంది. మొత్తం అప్పులు, చెల్లింపుల భారం ఇప్పటికే 10.20 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అప్పు తెచ్చిన నిధులతో జగన్‌ సర్కార్‌ అభివృద్ధి చేయడం లేదు. తెచ్చిన మొత్తాన్ని మళ్లీ అప్పులు తీర్చేందుకే వెచ్చిస్తోంది. ఇవి నిరాధార ఆరోపణలు కావు. అప్పుల లెక్కలు తమకు అందుబాటులో ఉంచడం లేదని చెబుతున్న కాగ్‌ రాష్ట్ర రుణ భయానక పరిస్థితిని తాజాగా కళ్లకు కట్టింది.

జగన్‌ పాలనలో మితిమీరిన అప్పు - ముందుంది ముప్పు - కాగ్‌ హెచ్చరిక

కార్పొరేషన్ల రుణ చెల్లింపులు కాకుండా గత ఏడేళ్లలో రాష్ట్రంలో అధికార అప్పుల అసలు, వడ్డీల భారం ఇలా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 23 వేల 305.77 కోట్లు అప్పుల కోసం చెల్లించారు. ఇందులో అసలు 9 వేల 458.91 కోట్లు కాగావడ్డీ 13 వేల 846.86 కోట్లు. 2018-19 ఏడాదిలో అసలు 13 వేల 570.83 కోట్లు కాగా వడ్డీ 15 వేల 341.97 కోట్లు. మొత్తంగా 28 వేల 912.80 కోట్లు కట్టారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో అసలు 18 వేల 628.00 కోట్లు, వడ్డీ 17 వేల 652.77 కోట్లు. మొత్తంగా 36 వేల 280.77 కోట్ల రూపాయలు అప్పుల చెల్లింపు కోసం వెచ్చించారు.

2020-21లో అసలు 13 వేల 735.08 కోట్లు, వడ్డీలు 20 వేల 17.83 కోట్లు. మొత్తంగా 33 వేల 752.91 కోట్లు రుణాలు తీర్చడానికి ఖర్చు చేశారు. 2021-22 ఏడాదిలో అసలు 13 వేల 920.41 కోట్లు, వడ్డీ 22 వేల 165.18 కోట్లు కాగా మొత్తం 36 వేల 85.59 కోట్లు చెల్లించిన పరిస్థితి. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో అసలు 16 వేల 290.56 కోట్లు, వడ్డీ 25 వేల 288.18 కోట్లు కాగా.. మొత్తం 41 వేల 578.74 చెల్లించారు. 2023-24లో అసలు 18 వేల 411.42 కోట్లు, వడ్డీ 28 వేల 673.71 కోట్లు కాగా మొత్తంగా 47 వేల 85.13 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో అప్పుల మొత్తం పెరుగుదల 102.03 శాతంగా ఉంది. అసలు చెల్లింపులు 94.6శాతం, వడ్డీ చెల్లింపు 107శాతం పెరిగాయి.

కొత్త ఏడాదికి అప్పులతో స్వాగతం పలికిన సీఎం జగన్

రాబోయే 5 ఏళ్లలో అప్పులు, వడ్డీల పెరుగుదల ఇలా ఉండే అవకాశం ఉంది. గడిచిన ఏడు సంవత్సరాల్లో సగటున అసలు 13 శాతం, వడ్డీలు 15శాతం చొప్పున పెరిగాయి. అదే రీతిలో రాబోయే 5 సంవత్సరాల లెక్కలు కడితే.. రాష్ట్రంపై ప్రతి ఏటా పడే భారం ఇలా ఉండబోతోందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అసలు 20 వేల 804.85 కోట్లు, వడ్డీ 32 వేల 974.76 కోట్లు కాగా మొత్తంగా 53 వేల 779.61 కోట్లు అప్పులకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. 2025-26 ఏడాదిలో అసలు 23 వేల 509.48 కోట్లు, వడ్డీ 37 వేల 920.97 కోట్లుగా... మొత్తంగా 61 వేల 430.45 కోట్లు చెల్లించాల్సి ఉంది.

2026-27 ఏడాదిలో అసలు 26 వేల 565.71 కోట్లు, వడ్డీ 43 వేల 609.11 కోట్లు మొత్తంగా 70 వేల 174.82 కోట్లు కట్టాల్సి ఉంటుంది. 2027-28 ఏడాదిలో అసలు 30 వేల 019.25 కోట్లు, వడ్డీ 50 వేల 150.47 కోట్లు మొత్తంగా 80 వేల 169.72 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2028-29 ఆర్థిక సంవత్సరంలో అసలు 33 వేల 921.75 కోట్లు, వడ్డీ 57 వేల 673.04 కోట్లు కాగా రెండింటికి కలిపి 91 వేల 594.79 కోట్లు కట్టాల్సిన దుర్భర పరిస్థితుల్లోకి రాష్ట్రం నెట్టివేయబడింది.

కార్పొరేషన్ల అప్పులు, వడ్డీల భారం కూడా అధికంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం 25 వేల కోట్ల రుణ సమీకరణకు బ్యాంకర్ల కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు రుణ సమీకరణ చేసింది. ఇందులో చివరి విడతగా ఎస్‌బీఐ ఇవ్వాల్సిన 12 వందల కోట్ల రుణం కేంద్ర అభ్యంతరాల వల్ల రాలేదు. ఈ రుణాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమీక్షిస్తే 25 వేల కోట్ల రుణాన్ని 157 వాయిదాల్లో తిరిగి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.

నెలకు 250 కోట్ల చొప్పున అసలు, వడ్డీ కలిపి చెల్లించాలి. ఈ ఒప్పందంతో ఏడాదికి 3,000 కోట్ల భారం పడుతుంది. 7.8శాతం వడ్డీ చెల్లించేందుకు జగన్‌ సర్కార్‌ తలూపింది. రెపో రేటు ఆధారంగా ఈ వడ్డీ భారం కూడా పెరిగే ఆస్కారం ఉంది. మొత్తం 14 ఆర్థిక సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించేలా ప్రణాళిక రూపొందించారు. 25 వేల కోట్ల రుణానికి మొత్తం తిరిగి చెల్లించేది 39 వేల 250 కోట్లు అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అగ్రస్థానం - అభివృద్ధిలో అధఃపాతాళాం: ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం

బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా దాదాపు 25 వేల కోట్ల రుణం సమీకరించారు. ఐదేళ్ల వరకు వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. ఆ తర్వాత అసలు చెల్లింపులు ప్రారంభమవుతాయి. అంటే 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి అసలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం అన్ని కార్పొరేషన్ల రుణాల భారాలు కలిపి 3 లక్షల 50 వేల కోట్లకు చేరినట్లు అంచనా.

ఈ అప్పు మొత్తానికి ఏడాదికి సుమారు 42 వేల కోట్లు అసలు, వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుందని ఒక అనధికార అంచనా. కార్పొరేషన్లకు ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు లేవు. వాటి రుణాల చెల్లింపులు కూడా ప్రభుత్వమే భరించాల్సి రావడంతో బడ్జెట్‌పై పెను ప్రభావం చూపుతుంది. కార్పొరేషన్ల రుణ భారం 40 వేల కోట్లకుపైగా కలిపి లెక్కిస్తే రుణాల చెల్లింపు భారం దాదాపు 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచే సుమారు లక్ష కోట్లకు చేరువవుతోంది. 2023-24లో 93 వేల 779.61 కోట్లు, 2024-25లో లక్షా వెయ్యి 430 కోట్లు, 2025-26లో లక్షా 10 వేల 174.82 కోట్లు, 2026-27 లో లక్షా 20 వేల 169.72 కోట్లు, 2027-28లో లక్షా 31 వేల 594.79 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రానికి రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల ఆశించినంత లేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిపోయిందని లెక్కకు మిక్కిలి అంచనాలు చూపి అధిక అప్పులు తెచ్చుకుంటున్నారు. గడిచిన ఆరేళ్లలో రాబడులు కేవలం 67శాతం మేర మాత్రమే పెరిగాయి. అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం వందశాతంపైగా పెరిగాయి. 2017-18లో లక్షా 5 వేల 62 కోట్లు, 2018-19లో లక్షా 14 వేల 670 కోట్లు, 2019-20 లో లక్షా 11 వేల 34 కోట్లు, 2020-21లో లక్షా 17 వేల 136 కోట్లు, 2021-22లో లక్షా 50 వేల 552 కోట్లు, 2022-23లో లక్షా 76 వేల 448 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది.

రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తే ఆదాయం వస్తుంది. ఎప్పటికప్పుడు రాబడి పెరుగుతుంది. నిజానికి సరైన రీతిలో రాష్ట్రంలో అభివృధ్ది చేసి ఉంటే ఇప్పటికే రాష్ట్ర రాబడులు 2 లక్షల కోట్లకు చేరాల్సి ఉంది. రాష్ట్రంలో ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు లేవు. జగన్‌ సర్కార్‌ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేక పోయింది. ఉన్న పరిశ్రమలూ పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. రాష్ట్రంలో ఉపాధి లేక అనేక మంది పక్క రాష్ట్రాల రాజధానులకు చేరిపోయారు. వైద్యం, షాపింగులకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఖర్చు చేస్తుండటంతో ఆ ఫలాలూ రాష్ట్రానికి దక్కడం లేదు.

రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే మూలధన వ్యయం అంతంతే ఉంటోందని కాగ్‌ సైతం తేల్చి చెప్పింది. ఇతర రాష్ట్రాలు మూలధన వ్యయం 14.41శాతం వరకు చేస్తోంటే ఆంధ్రప్రదేశ్‌లో అది కేవలం 9.21శాతమే ఉందని కాగ్‌ స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తులు పెరగబోవని దీర్ఘకాలంలో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోతుందని కాగ్‌ ఇప్పటికే కుండబద్దలు కొట్టింది. ఇవేవీ పట్టించుకోకుండా జగన్‌ సర్కార్‌ మితిమీరి అప్పులు చేస్తోంది. రాష్ట్రాన్ని రుణ విషవలయంలోకి నెట్టేసింది.

వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.