Bullock Cart: తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన నాగ దుర్గారావు దిల్లీకి చేపట్టిన యాత్ర నిలిచిపోయింది. ఐదు రోజుల కిందట చేపట్టిన ఎడ్లబండి యాత్ర వరంగల్ సమీపంలోని డోర్నకల్ చేరాక పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని పెద్ద మనుషులు, పోలీసులు హామీ ఇవ్వడంతో దుర్గారావు వెనుదిరిగారు.
తన చెల్లికి న్యాయం చేయాలని.. తమపై వేసిన పరువు నష్టం కేసును, ఇతర కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తన చెల్లికి న్యాయం జరగని పక్షంలో తిరిగి యాత్ర చేస్తానని దుర్గారావు తెలిపారు. దుర్గారావు ఎడ్లబండి యాత్రపై ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఈ కేసును విచారించి వచ్చేనెల 13కు వాయిదా వేసింది.
ఇదీ జరిగింది.. : ఎన్టీఅర్ జిల్లా నందిగామ మండలం ముప్పాలకి చెందిన నాగదుర్గరావు.. అతని చెల్లెలు సత్యవతిని చందాపురానికి చెందిన నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త తనతో సరిగ్గా ఉండడం లేదంటూ పుట్టింటికి వచ్చేసింది సత్యవతి. భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ విషయమై నాగదుర్గరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా.. ఫలితం లేకపోవడంతో తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎడ్లబండిపై దిల్లీ ప్రయాణమయ్యాడు.
ఇవీ చదవండి: