British Deputy Commissioner Gareth Wynn Owen in AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, కంచికచర్లలో బ్రిటన్ దేశ ప్రభుత్వ డిప్యూటీ కమిషనర్ గారత్ విన్ ఓవెన్ పర్యటించారు. కంచికచర్లలో రైతు భరోసా కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు సిబ్బందితో మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం నందిగామలోని వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను పరిశీలించారు. ల్యాబ్‌లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత పరీక్షలు చేసే విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ల్యాబ్‌లో జరిగే పరీక్షల విధానాన్ని ఓవెన్‌కు వివరించారు.
విత్తనాలు మొలక శాతాన్ని పరిశీలించటం, ఎరువులు విత్తనాలు పురుగుమందుల నాణ్యతను పరిశీలించే యంత్రాలను ప్రత్యేకంగా పరిశీలించి వాటి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ... రైతు భరోసా కేంద్రాలు, అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లో పనితీరు బాగుందని తెలిపారు. వీటివల్ల రైతులకు మంచి ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగులు మందులు, ఎరువులు రైతులకు అందే అవకాశం ఉందని తెలిపారు.
ఇవీ చదవండి: