ETV Bharat / state

అవాక్కయ్యో ఆకృతులు - చిట్టి కుండీలో భారీ వృక్షం - అదిరిపోయేలా బోన్సాయ్ వృక్ష ప్రదర్శన - విజయవాడ తాజా వార్తలు

Bonsai Trees Exhibition In Vijayawada : ప్రకృతి అందాలకు ముఖ్య కారణం మొక్కలు. పచ్చని చెట్లు ఎక్కడున్నా అక్కడ అందమైన, స్వచ్ఛమైన వాతావరణం అలుముకోవడం సహజం. అటువంటి ఆకర్షణీయమైన మొక్కల్లో అరుదైన బోన్సాయ్ మొక్కల ప్రదర్శన ఎన్టీఆర్​ జిల్లా విజయవాడ రాజీవ్ గాంధీపార్క్​లో జరుగుతుంది.

bonsai_trees_exibition_in_vijayawada
bonsai_trees_exibition_in_vijayawada
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 4:33 PM IST

Bonsai Trees Exhibition In Vijayawada : విజయవాడ రాజీవ్ గాంధీపార్క్​లో అమరావతి బోన్సాయ్​ సొసైటీ ఆధ్వర్యంలో బోన్సాయ్ వృక్ష ప్రదర్శనను ఏర్పాటు చేశాను. ఈ ప్రదర్శనలో మొక్కలను అందమైన డిజైన్లలో చేసి ప్రదర్శించారు. వివిధ రకాల మొక్కలతో పార్కు చాలా అందంగా అలంకరించారు. ఈ వృక్ష ప్రదర్శన చూడడానికి స్థానికులు తరలి వస్తున్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 1,2,3, తేదీల్లో జరుగుతోంది. వారాంతరం కావడంతో వివిధ ఆకార అలంకరణలతో ఉన్న బోన్సాయ్​ మొక్కలను చూడటానికి జనాలు మక్కువ కనబరుస్తున్నారు.

ఆ మొక్కల వయసు 47 ఏళ్లు.. అలాంటివి ఆ ఇంట్లో 400

Bonsai Design Plants Exhibition : ఈ కార్యక్రమానికి కలెక్టర్ డిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్​, అమరావతి బోన్సాయ్ సొసైటి అధ్యక్షురాలు అమృతకుమారి సహా పలువురు ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు బోన్సాయ్ వృక్షాలు ఎంతాగానో తోడ్పడతాయన్నారు. విజయవాడ రాజీవ్ గాంధీపార్క్ లో అమరావతి బోన్సాయ్ సొసైటి ఏర్పాటు చేసిన బోన్సాయ్ వృక్ష ప్రదర్శనను, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలసి ఆయన ప్రారంభించారు.

బోన్సాయ్​ మొక్కల పెంపకం.. హైదరాబాద్​లో ఇప్పుడిదే ట్రెండింగ్

Vijayawada Rajiv Gandhi Park : ఈ ప్రదర్శనలో ఆరు నుంచి 30 ఏళ్లనాటి మరగుజ్జు మొక్కలను, గృహ అలంకరణ తీగలను ఉంచారు. కుండీలలో పెంచిన 100 రకాల జాతులకు చెందిన 150 రకాల మొక్కలు ప్రదర్శించారు. అనంతరం మొక్కలను కలెక్టర్ సందర్శించారు. ఎకరాల విస్తీరణంలో భారీ కాండాలతో పెరిగే మొక్కలను కూడా చిన్న కుండీలో పెంచటం పై నిర్వాహకులను అభినందించారు.

35 ఏళ్లుగా 'బొన్సాయ్​' మొక్కల పెంపకంలో ప్రొఫెసర్​

Collector Dilli Rao In Bonsai Exhibition : ఒకప్పుడు విదేశాలలో బోన్సాయ్ మొక్కల పెంపకం ఎక్కువగా ఉండేదని వారు అన్నారు. కానీ ప్రస్తుతం మన దేశంలో కూడా వీటి పెంపకం అధికమైందని వారు హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో బోన్సాయ్ మొక్కలు చాలా ప్రభావం చూపిస్తాయని కలెక్టర్​ డిల్లీ రావు పేర్కొన్నారు. ఈ వృక్షాలు పెంచటానికి పెద్దగా ప్రదేశం అవసరంలేదని నిర్వాహకులు తెలిపారు. మొక్కలపై అవగాహన కల్పించి పెంపకదారుల సంఖ్య పెంచేందకు ఈ ప్రదర్శన చేపట్టామని వారు అన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన మధ్యహ్నం 3.30 గంటలను ప్రారంభమై రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతోందని సొసైటీ వారు తెలిపారు.

చిట్టితోటలో 400 రకాల బోన్సాయ్ చెట్లు

అవాక్కయ్యో ఆకృతులు - చిట్టి కుండీలో భారీ వృక్షం - అదిరిపోయేలా బోన్సాయ్ వృక్ష ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.