Somu Veerraju on Kandukur Incident: కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో జరిగిన దుర్ఘటన బాధ కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాజకీయ సభలకు కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని.. రాజకీయ పార్టీలుగా విబేధాలున్నా.. ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటువంటి సమయంలో పోలీసులు కూడా భద్రతను కల్పించాలన్నారు. సభలపై చర్చించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అధికార యంత్రాంగానికి సభలకు వచ్చే జనంపై కనీస అంచనా ఉండాలన్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా విచారించదగినది. టీడీపీ సభలకు అన్ని విధాలైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ బాధ్యతగా నేను భావిస్తున్నాను. - సోమువీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చదవండి: