ETV Bharat / state

రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం.. మాచర్ల ఘటనే నిదర్శనం : ఐవైఆర్ కృష్ణారావు - విజయవాడ వార్తలు

IYR Comments: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని.. భాజపా నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. అందుకు ఇటీవల జరిగిన మాచర్ల హింసే నిదర్శనమన్నారు. ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న పాలకులే ఇలాంటి పరిస్థితులకు కారణమన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకోకుండా అన్నీ పంచిపెడతామంటే రాష్ట్ర భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరించారు.

IYR Krishna Rao
ఐవైఆర్ కృష్ణారావు
author img

By

Published : Dec 26, 2022, 11:44 AM IST

IYR Comments: ఇటీవల మాచర్లలో జరిగిన ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ సీఎస్, భాజపా నేత ఐవైఆర్ కృష్ణరావు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలానే ఉంటే మాచర్ల ఘటనలు పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్ర రాజకీయాలు కుల, కుటుంబ, వారసత్వ రాజకీయాలకు నిలయంగా మారాయన్నారు. వాజ్​పేయ్ బాటలో ప్రధాని మోదీ నడుస్తున్నారని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు ముఖ్యమేనన్నారు. అభివృద్ధి లేకుండా సంక్షేమం ఉంటే సుపరిపాలన కాదన్నారు.

"వ్యక్తి , సమాజం, రాష్ట్రం, దేశం ఇలా ఎవరైనా సమన్వయం తప్పితే ప్రజలకు ప్రమాదం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేక పోతోంది. తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా పథకాలు అన్నీ తీసేస్తారు. వచ్చే ఏడాదిన్నర ఎలా అయినా పథకాలు అన్నీ ఇచ్చి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఏదో ఒక రోజు వీటిని నిలుపుదల చేస్తారు. మాచర్లలో జరిగిన ఘటన.. ప్రభుత్వాన్ని క్షమించరాని తప్పిదం. శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా పరిపాలన ఉంది". - ఐవైఆర్ కృష్ణరావు , మాజీ సిఎస్, భాజపా నేత

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్న భాజపా నేత ఐవైఆర్ కృష్ణారావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.