Bhagavad Gita Jayanti festivals : విజయవాడలోని దుర్గామల్లేశ్వర సిద్ధార్ధ మహిళా కళాశాలలో గీతాజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 700 శ్లోకాల భగవద్గీతలోని ముఖ్య అంశాలను దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ, మహిళా కళాశాల డైరెక్టరు విజయలక్ష్మి, ఇతర అధ్యాపకులు, విద్యార్ధినులు సామూహిక పారాయణం చేశారు. ప్రపంచంలో జయంతి నిర్వహించుకుంటున్న ఏకైక గ్రంథం భగవద్గీత అని.. ఇప్పటికి 5150 ఏళ్లక్రితం ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లా కేంద్రంలోని జ్యోతిసర్ స్థలంలో మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున కృష్ణుడు.. భగవద్గీతను అర్జునుడికి బోధించిన రోజున గీతా జయంతిగా పాటిస్తుండడం అనాదిగా వస్తోందని అధ్యాపకులు పేర్కొన్నారు. కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత అని... అనేక సంశయాలను.. మానసిక దుర్భలత్వానికి భగవద్గీత గ్రంథంలో అనేక సమాధానాలు ఉన్నాయని తెలిపారు. వేదాలు, ఉపనిషత్తుల సారం భగవద్గీత అని.. సూక్ష్మంలో మోక్షం ఇచ్చేది ఈ గ్రంథమని... సమస్త ధర్మాలను మార్గాలను సమన్వయపరిచి ఏకత్వాన్ని భగవద్గీత బోధిస్తుందన్నారు.
ఇవీ చదవండి :