ETV Bharat / state

ఆదేశాలను లెక్కచేయకుండా కోడి పందేల బరుల ఏర్పాటు.. బిసైడ్​ ఆర్డీవో ఆఫీస్​.. - cock fighting

Kodi Pandalu : కోడి పందేలను నిర్వహించటానికి నిర్వహకులు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలు అధికారులు ఇచ్చే ఆదేశాలంటే వారికిి లెక్కే లేకుండా పోతొంది. చివరికి ఆర్డీవో కార్యాలయం పక్కనే బరులను సిద్ధం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Kodi Pandalu
కోడి పందేల బరులు
author img

By

Published : Jan 13, 2023, 7:33 PM IST

Kodi Pandalu : రాష్ట్రంలో కోడిపందాల బరుల ఏర్పాటుకు అడ్డుఅదుపు లేకుండా పోతొంది. కోడి పందాల బరులను ఏర్పాటు చేసేందుకు నిర్వహకులు.. ఆదేశాలను, నిషేదాలను అసలు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల పక్కన, పశువుల సంతలో, మామిడితోటలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బరులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆదేశాలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న బరులను అధికారులు తొలగిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని ఆధికారులు హెచ్చరిస్తున్నారు.

జిల్లాలోని తిరువూరులో ఆర్డీవో కార్యాలయం పక్కనే కోడి పందేల కోసం బరులను ఏర్పాటు చేశారు. కార్యాలయం పక్కనే ఉన్న మామిడి తోటలో పందేలకు బరులను సిద్ధం చేశారు. అధికారులు బరుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తున్న నిర్వహకులు పట్టించుకోవటం లేదు. అలాగే పశువుల సంత సమీపంలోని మామిడితోటలో మరో బరి సిద్ధం చేశారు.

తిరువూరు మండంలోని కాకర్ల, మల్లేల గ్రామాలలో బరులను ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా.. ఏ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో బరులను సిద్ధం చేశారు. ఏ. కొండూరు మండలం గోపాలపురంలో, విసన్నపేట మండలం పుట్రేల, కొర్లమండ, వేమిరెడ్డిపల్లి, విస్సన్నపేట గ్రామాలలో ఏర్పాటు చేశారు. గంపలగూడెం మండలం ఊటుకూరు, కొణిజర్ల గ్రామంలో కోడిపందాల బరులను తయారు చేసి ఉంచారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరులో కోడి పందాల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. ఆదేశాలను లెక్క చేయకుండా.. పెద్ద ఓగిరాల, ఆకునూరులలో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు నేల మట్టం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఉయ్యూరు ఎస్ఐ తిరుమలరావు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.