ETV Bharat / state

ప్రజాసమస్యల పరిష్కారం కోసం.. డిసెంబర్​ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర: శైలజానాథ్​ - డిసెంబర్​ నుంచి శైలజానాథ్ పాదయాత్ర

Congress Leader SailajaNath : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం.. భాజపా అజెండాను అమలు చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని మోదీ నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Congress Leader Sailaja Nath
Congress Leader Sailaja Nath
author img

By

Published : Nov 15, 2022, 4:23 PM IST

APCC PRESIDENT SAILAJANATH PADAYATRA : ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. తమ పాదయాత్రకు ప్రజలు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో వైకాపా, భాజపాలు కలిసిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్ దిల్లీలో తాకట్టు పెట్టారని విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శైలజానాథ్​ విమర్శించారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం.. భాజపా అజెండాను అమలు చేస్తుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని మోదీ నడుపుతున్నారన్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో వైకాపా విఫలమయ్యిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం దారుణమన్నారు. ప్రజల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: మీడియా సమావేశానికి ముందు సూపర్​స్టార్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ తరుఫున రెండు సార్లు ఎంపీగా గెలిచి ప్రజా సమస్యలను పార్లమెంట్​లో లేవనెత్తారన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.