ETV Bharat / state

EMPLOYEES: సమ్మె సైరన్ మోగించనున్న.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..!

Ward Sachivalayam Employees: తమ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ సర్కార్ పై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతున్నారు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా తమకు పదోన్నతులు, బకాయి ఉన్న ఎరియర్స్​ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా పరిగణిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్న.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఈటీవీ భారత్ కథనం.

Sachivalayam Employees
సచివాలయ ఉద్యోగులు
author img

By

Published : May 1, 2023, 4:34 PM IST

సమస్యలు పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి

Ward Sachivalayam Employees in AP: సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే వైకాపా సర్కారుపై ప్రత్యక్ష పోరాటానికి సిద్దమవుతుండగా.. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం పదోన్నతులు, బకాయిల కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా పరిగణించడం తగదంటున్నారు.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు రావలసిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాల విషయంలో న్యాయం చేయాలని అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తి కాగానే వెంటనే ఖరారు చేయకుండా.. నిబంధనలకు విరుద్ధంగా 9 నెలలు ఆలస్యం చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు. రెండో నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 17 వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ఐదు నెలలు ఆలస్యంగా ప్రొబేషన్ ఇవ్వడం వల్ల తమకు రావాల్సిన 5 నెలల బకాయిలు అందించాలని వారు కోరుతున్నారు. న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల విషయంలో అన్నివిధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన్యం ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఏజెన్సీ అలెవెన్సులు వర్తిస్తుండగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం అవేమీ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పదోన్నతుల విధానాన్ని రూపొందించి, వాటిని సంబంధిత సర్వీస్ రూల్స్‌లో పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.

'ప్రభుత్వ ఉద్యోగులతో పొల్చుకుంటే ప్రభుత్వం తమను ద్వితీయ శ్రేణి ఉద్యోగులగా చూస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు మెదటి రోజు నుంచే పేస్కేల్​లో జీతాలు తీసుకుటున్నారు. తమకి మాత్రం రెండేళ్ల తర్వాత పే స్కేల్ అమలు చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉంటే తమకు లేదు. తాము రోజులో మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తుంది. బయోమెట్రిక్ ఆధారంగానే తమకు జీతాలు ఇస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. అన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలి, ముఖ్యంగా అంతర్ జిల్లాల బదిలీలకు కచ్చితంగా అవకాశం కల్పించాలి. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేనాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. బదీలీలకు సంబంధించి అధికారుల నుంచి కొంత స్పందన వచ్చిందని, మరోక 10 రోజుల్లో బదీలీల ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. అధికారులు కాలయాపన చేయకుండా... వారు చెప్పిన విధంగా బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి.-' జి.ఎస్‌.డబ్య్లూ.ఎస్‌. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు

ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని... గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.