- రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్డుషోలపై ప్రభుత్వం మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ఆ రాష్ట్ర సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. గుంటూరు, కందుకూరు తొక్కిసలాట ఘటనల దృష్ట్యా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్టు నిబంధనలు వర్తింపజేశారు. ఆ ప్రాంతాల్లో రోడ్డుషోలు నిర్వహించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములపై.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
High Court Comments on Amaravati: రాజధాని అమరావతి కోసం రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయింపు వ్యవహారంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్ల తీరును ఆక్షేపించింది. బెంచ్ హంటింగ్ చేస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజధానేతరులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్‌డీఏ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలై, ద్విసభ్య ధర్మాసనం ముందు ఉన్న వ్యాజ్యాలను తమ వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరు వాహనాలు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు.. తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగం!
2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెరగనున్న ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు.. ఆ నిబంధనలే కారణం
ఎయిర్ కండీషనర్లు (ఏసీ), రిఫ్రిజిరేటర్ల ధరలను పెంచేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఏసీల ధరలు 5-8 శాతం వరకు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బీఈఈ కొత్త నిబంధనల వల్లే వీటి ధరలు పెరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ నిల్వ.. దిగజారుతున్న పాక్ ఆర్థిక స్థితి!
Pakistan Economic Crisis : పాకిస్థాన్‌లో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. దీంతో సబ్సిడీ అందించే నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. ఈ క్రమంలో ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ప్రజలు.. వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపి నిల్వ చేసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుడప్పుడు వనవాసం.. కంటినిండా నిద్ర.. కొత్త ఏడాదికి హెల్తీ రూల్స్!
కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలను అందరూ ఏర్పరచుకుంటారు. వాటిని సాధించేందుకు ఆరోగ్యమే ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకు కొన్ని నిమయాలను సూచిసుస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ద్రవిడ్ వారసుడిగా లక్ష్మణ్.. బీసీసీఐ నిర్ణయం ఏంటో మరి?
దాదాపు 12 ఏళ్ల నుంచి టీమ్‌ఇండియాకు ఐసీసీ ట్రోఫీని గెలవడం తీరని కలగా మిగిలిపోయింది. ధోనీ నాయకత్వంలో 2011లో భారత్ వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. అప్పుడు ప్రధాన కోచ్‌గా కిరిస్టెన్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత కోచ్‌లు, కెప్టెన్లు మారినా కప్ మాత్రం దక్కలేదు. అయితే ప్రస్తుతం కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్ ద్రవిడ్ ప్లేస్‌లో మరో కోచ్ పేరు వినిపిస్తోంది. అతడే మన 'వెరీ వెరీ స్పెషల్' లక్ష్మణ్! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రిలీజ్‌కు ముందే 'ప్రాజెక్ట్-కే' సంచలనాలు.. నిర్మాతకు కనక వర్షం!
నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ప్రాజెక్ట్-కే. ఆదిపురుష్, సలార్ తర్వాత ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ నయా అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాళ్లు వద్దనుకుంటున్నవే చేస్తానంటున్న మృణాల్ ఈ ఏడాదంతా అవే
సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులు దోచుకున్న మృణాల్ ఠాకుర్ కొత్త సంవత్సరాన్ని మరి కొన్ని కొత్త ప్రాజెక్టులతో ప్రారంభించింది. నేచురల్ స్టార్ నానీతో ఓ కొత్త సినిమా తీయనున్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ముచ్చట్లు మీ కోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.