- ఏడాది తర్వాత వచ్చే ఎన్నికలకు.. ఇప్పుడే కుర్చీ లాగేస్తున్నారు: ఎమ్మెల్యే ఆనం
MLA Anam Sensational Comments: వెంకటగిరి ఎమ్మెల్యే మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని.. మన వాళ్ళల్లో ఒకరు చెబుతున్నారని సచివాలయ వాలంటీర్లు, వైకాపా సమన్వయ కర్తల సమావేశంలో అన్నారు. దీనిపై ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
- కందుకూరు ఘటనపై శవరాజకీయాలు తగదు: టీడీపీ
Condolences of TDP leaders : కందుకూరు ఘటనపై టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగటం దురదృష్టకరమని.. పార్టీ కార్యకర్తల కుటుంబసభ్యులను కొల్పోయి తాము బాధలో ఉంటే.. వైసీపీ నేతలు శవరాజకీయాలు చేయటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- విశాఖలో మైనర్ బాలికకు వేధింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు
Harassment of Minor Girl: విశాఖలో ఓ వ్యక్తి మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. అతని ఆగడాలు శృతిమించడంతో.. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుంటే అతను జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన నేతలు స్పష్టం చేశారు.
- ఎన్టీఆర్ జిల్లాలో ఆగని కిడ్నీ మరణాలు.. ఒకే రోజులో..!
Two people died with kidney disease: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో కిడ్నీ మరణాలు ఆగడం లేదు.. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు కిడ్నీవ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. ఎ. కొండూరులో మాలపల్లికి చెందిన పొన్నంపల్లి డేవిడ్ రాజు, దీప్లానగర్ తండాకు చెందిన భూక్య సీతమ్మ విజయవాడ ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
- జవాన్ల కోసం 3డీ ప్రింటెడ్ ఇళ్లు.. భూకంపం వచ్చినా సేఫ్.. 'ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా..
సైన్యం కోసం అహ్మదాబాద్‌లో తొలి 3డీ ప్రింటెడ్ గృహ సముదాయాన్ని ప్రారంభించినట్లు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో కేవలం 12 వారాల్లోనే ఈ నిర్మాణాలు పూర్తి చేసినట్లు పేర్కొంది.
- తలపై కొట్టిందని భార్యపై ఫిర్యాదు.. సాక్ష్యంగా రోటీ కర్ర తెచ్చిన భర్త
భార్య తన తలపై రోటీ కర్రతో కొట్టిందని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. ఈ ఘటన బిహార్ గోపాల్‌గంజ్‌లో జరిగింది. అయితే.. తన భార్య దాడికి ఉపయోగించిన రోటీ కర్రను కూడా సాక్ష్యంగా తీసుకెళ్లాడు బాధితుడు.
- చైనాలో కొవిడ్ కేసులపై అనుమానాలు.. మరోసారి ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా?
China Covid Outbreak : చైనా కరోనా విస్ఫోటనం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు తమ దేశంలో ఎక్కడ కల్లోల పరిస్థితులకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తమ దేశంలో కరోనా కల్లోలం లేదని చైనా చెబుతున్నప్పటికీ.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలోనూ డ్రాగన్ ఇవే మాటలు చెప్పిందని దేశాలన్నీ గుర్తు చేస్తున్నాయి.
- విమానంలో తీవ్ర ఘర్షణ.. ఓ వ్యక్తిపై తోటి ప్రయాణికుల దాడి..
థాయ్ స్మైల్ ఎయిర్వేస్లో ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వివాదంపై థాయి స్మైల్ ఎయిర్ వేస్ స్పందించి.. ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఓ నివేదికను సమర్పించింది.
- సూర్యకుమార్, స్మృతి మందాన.. ఆ ఐసీసీ అవార్డుకు నామినేట్
సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన టీ20ల్లో క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంకా ఎవరెవరంటే?
- రవితేజ రేంజ్ మామూలుగా లేదుగా.. 'వాల్తేరు వీరయ్య' కోసం అన్ని కోట్లా?
మాస్ మహారాజ రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం ఇటీవలే విడుదలై.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రవితేజ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టంట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మాస్ హీరో పారితోషికం ఎన్ని కోట్లంటే..