ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Nov 13, 2022, 9:01 PM IST

  • యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​
    రాజధాని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి వేలకోట్లు అవినీతి సొమ్ము దోచుకుంటున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గుంకలాం కాలనీనీ సందర్శించిన పవన్, జగనన్న ఇళ్ల నిర్మాణంలో రూ.10 నుంచి 15 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై ప్రధానికి తానే స్వయంగా నివేదిక అందజేస్తానన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పోలవరం డయాఫ్రమ్ వాల్​పై నిర్ణయం అప్పుడే..'
    పోలవరం ప్రాజెక్ట్‌ డయాఫ్రమ్‌ వాల్‌ స్థితిగతులపై.. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా పనులు చేపడతామని జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రాజెక్ట్​కు సంబంధించి అప్పర్, లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, గ్యాప్-1 పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటిలో మునిగిపోయిందని.. మోటార్ల సాయంతో నీటిని తోడుతున్నామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Annavaram: అన్నవరంలో పోటెత్తిన భక్తులు.. తోపులాట
    సత్యదేవుని దర్శనం కోసం అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించకపోవడంతో ఆలయ క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు
    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో రెండు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. గుడ్లూరు మండలంలో ఉప్పుటేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గుడ్లూరు - బసిరెడ్డిపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పిలవని పెళ్లికి వెళ్లి రూ.200 గిఫ్ట్ వద్దనేసరికి నానా రభస
    పిలవని పేరంటానికి వెళ్లిన యువకుడు అక్కడి అతిథులపై దాడి చేశాడు. కానుకలు స్వీకరించలేదని అభిజిత్ అనే యువకుడు వివాహ విందులో హల్​చల్ చేశాడు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. వధువు సోదరుడికి స్నేహితుడైన అభిజిత్​కు వివాహానికి ఆహ్వానం అందలేదు. గతంలో గొడవ జరిగిన కారణంగా అభిజిత్​ను పెళ్లికి, రిసెప్షన్​కు పిలవలేదు వధువు సోదరుడు. అయినప్పటికీ అభిజిత్ రిసెప్షన్​కు వెళ్లాడు. అనంతరం పెళ్లి కానుకగా 200 రూపాయలు ఇచ్చాడు. కానుకను తీసుకునేందుకు వధువు తండ్రి అనిల్ కుమార్ నిరాకరించాడు. దీంతో అతిథులపై దాడి చేశాడు అభిజిత్. ఈ దాడిలో అనిల్​తో పాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 61కేజీల బంగారం స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్ల పైనే.. ఎలా తెచ్చారంటే..?
    ముంబయి ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో 61 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బాయ్​ఫ్రెండ్​ను పెళ్లి చేసుకున్న ట్రంప్ కూతురు ఫొటోలు చూశారా
    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ పెళ్లిపీటలెక్కారు. తన బాయ్​ఫ్రెండ్ మైఖెల్ బౌలస్​ను వివాహం చేసుకున్నారు. ట్రంప్​కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్​లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వడ్డీ రేట్లు పెరిగాయని పాత FDలు రద్దు చేస్తే లాభమా, నష్టమా?
    ఒకప్పటి వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గతంలో తమ సొమ్మును తక్కువ వడ్డీకి జమ చేసిన వారు.. తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 World Cup: ఇంగ్లాండ్​ విన్నింగ్​ సెలబ్రేషన్స్​ చూశారా?
    ఊహలకు మించిన కిక్​ను అందించింది 2022 టీ20 వరల్డ్​ కప్. ఎన్నో మలుపులు, ఊహించని ట్విస్ట్​లతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. చివరకు పొట్టికప్​ను ఇంగ్లాండ్​ గెలుచుకుంది. ఆనందంతో గంతులేసింది. ఆ వీడియో మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దేవుడా అందరికీ చెప్పలేక చస్తున్నా'.. జగ్గూ భాయ్ సాయిబాబా​ పూజ వీడియో వైరల్​!
    టాలీవుడ్​ సీనియర్​ నటుడు జగపతిబాబు.. సోషల్​మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియో షేర్​ చేసిన ఆయన.. 'దేవుడా అందరికీ చెప్పలేక చస్తున్నా' అంటూ క్యాప్సన్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.