ETV Bharat / state

ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు.. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణమే ముద్దు : సీపీఎం ఆందోళన - Gunadala railway flyover news

Gunadala Railway Flyover constructed immediately: 'ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు-గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణమే ముద్దు' అనే నినాదంతో సీపీఎం నాయకులు విజయవాడలో నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. గుణదల రైల్వేఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడకుండా బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

Gunadala Railway Flyover
Gunadala Railway Flyover
author img

By

Published : Apr 8, 2023, 7:23 PM IST

Gunadala Railway Flyover constructed immediately: విజయవాడలోని గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబు రావు డిమాండ్ చేశారు. విజయవాడలోని గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నేడు నిరసన కారక్రమాన్ని చేపట్టారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ.. 'ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు-గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణమే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్, ఉన్నతాధికారులు స్పందించకపోతే.. ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. 2009వ సంవత్సరంలో రూ.36 కోట్ల రూపాయలతో గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. ఆనాటి నుంచి నేటివరకు బ్రిడ్డ్ పనులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఐదేండ్లకొకసారి ముఖ్యమంత్రులు మారుతున్నారే తప్పా.. గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ను మాత్రం పూర్తి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రైల్వే ట్రాక్ మీద నుంచే ప్రజలు తమ రాకపోకలను సాగిస్తున్నారని గుర్తు చేశారు.

రైలు గేటు వేసి ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, వాహనదారులు గేటును దాటి ప్రయాణాలు చేస్తున్నారని.. బాబు రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా.. గుణదల రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభించకపోవడం అన్యాయమన్నారు. గూడ్స్ రైళ్లు వస్తే మండుటెండలో సుమారు అరగంట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడటమేంటని ఆయన ప్రశ్నించారు.

అనంతరం అత్యవసర పరిస్థితుల్లో నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. అనారోగ్యంతో బాధపడే వారిని ఆసుపత్రులకు తరలించడం కష్టమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి.. రైల్వే బ్రిడ్డ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తి చేయనిపక్షంలో ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తామని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబు రావు ప్రభుత్వాన్ని హెచ్చిరించారు.

''గుణదలలో పదమూడు ఏళ్లుగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్.. ఈ ప్రభుత్వాల చేతకానితనానికి అద్దం పడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఇప్పటికీ మూడు ప్రభుత్వాలు మారాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు. కానీ, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండిపోయినట్టుగా ఉంది. ఈ బిడ్జ్ నిర్మాణం నిలిచిపోయి.. నాలుగు లక్షల మంది ప్రజలకి, రాకపోకలకి ఆటంకంగా మారిపోయింది. నూజివీడు మొదలుకొని విజయవాడ దాకా రాకపోకలు సాగిస్తున్న ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికైనా గుణదల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలి.'' -సీహెచ్ బాబు రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.