AP Audit employees: దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ ఆడిట్ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, అధికారులు ఈ నెల 17న మరోసారి చర్చలకు పిలిచినట్టు ఆడిట్ ఉద్యోగసంఘ నాయకులు తెలిపారు. ఈ సారి సానుకూల స్పందన రాకుంటే సమ్మెకు వెళ్తామని తెలిపారు. సీనియర్, జూనియర్ ఆడిటర్లను ఎ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించడాన్ని ఉద్యోగులు ఖండించారు. రాష్ట్రంలోి ఏ శాఖలో లేని ఈ విధానాన్ని తమకే ఎందుకు ఆపాదిస్తున్నారని ప్రశ్నించారు. పని ప్రదేశాలలో ఉద్యోగులపై వివక్ష పూరితంగా వ్యవహరించడం తగదన్నారు. ఇలా చేయడం రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 19 (2) ని ఉల్లంఘించడమేనని ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతోనే జిల్లాల విభజన పేరుతో డివిజన్ ఆఫీసులను తొలగించారన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుందన్నారు.
ఇదీ చదవండి :