AP Professionals Forum Meeting in Vijayawada : కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం తీసుకున్న అప్పులకు లెక్కలు చెప్పాలని ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం డిమాండ్ చేసింది. ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా?అనే అంశంపై విజయవాడలోని ఓ హోటల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు కాగ్ నివేదికలో కూడా తెలిందని నేతలు ఆరోపించారు. కార్పొరేషన్ల ద్వారా లక్షల కోట్లు అప్పు తెచ్చి వాటికి అకౌంట్స్ ఇవ్వకపోవటంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర సంస్థలు జోక్యం చేకుకోవాలని డిమాండ్ చేశారు.
వామ్మో పది లక్షల కోట్లా! - ఏపీలోకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా రాష్ట్ర అప్పులు
Debts in YCP Government : ఏపీ ప్రొఫెషనల్ ఫోరం కన్వీనర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా కార్పోరేషన్ల పేరుతో అప్పులు తెస్తున్నారని మండిపడ్డారు .దీనిపై కోర్టులో పిల్(PIL) వేసి న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యమేలుతుందా? అనే అంశంపై విజయవాడ హోటల్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు హజరయ్యారు. కార్పొరేషన్ల ద్వారా రూ. 3.40 లక్షల కోట్ల అప్పును వైసీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు.
All Party Round Table Meeting : ఈ అప్పులను బడ్జెట్లో పెట్టకుండా, అసెంబ్లీలో చర్చ జరపకుండా తెచ్చారని ఆరోపించారు. బిల్లులు చెల్లింపులు సక్రమంగా జరకపోవటంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటామని పలు సార్లు హెచ్చరించారని గుర్తు చేశారు. దీనిపై కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల అకౌంట్స్‌ను ప్రభుత్వం ఇవ్వకపోవటం రాజ్యాంగా విరుద్ధమని అన్నారు. ఆర్ధిక అరాచక పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు.
రికార్డు స్థాయిలో అప్పులు, రాబోయే ప్రభుత్వానికి చుక్కలు కనపడటం ఖాయం!
Debts of Corporations in AP : అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రతి ఒక్క పౌరుడు దృష్టీ సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ముసుగులో లక్షలాది రూపాయల దోపిడీ చేస్తుందని విమర్శించారు. ఏపీలో ఉన్న కార్పోరేషన్లు, లిక్కర్ పాలసీలు ఏ రాష్ట్రంలో లేవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఇప్పటికి బిల్లులు మంజూరు చేయకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు.
అప్పులతో రోడ్డున పడుతున్న పరువు - ఆర్థికంగా రాష్ట్రం బలహీనంగా ఉందన్న ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు నిబంధనలు పక్కనపెట్టి అప్పులు తెచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే తాము తక్కువ అప్పు చేశామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పలు చేసి అవన్నీ ప్రజలకు పథకాల రూపంలో పంచామని మరోసారి ఆర్థికమంత్రి వ్యాఖ్యానించటం సరికాదని తెలిపారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో గేటు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం సొంతజిల్లాలో, అలాగే అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టు గేటులు కొట్టుకుపోవటానికి కారణం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటమేనని ఆరోపించారు.