ETV Bharat / state

మిత్రుని రాకకై ఎదురుచూస్తూ.. బోస్టన్​లో ఏపీకి చెందిన వ్యక్తి మృతి - latset ap breaking news

AP Person Died In Boston : భారత్​ నుంచి తన మిత్రుడు వస్తున్నాడని తెలుసుకుని విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మిత్రుని రాకకై విమానాశ్రయం ఎదుట వేచి చూస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

AP Person Died In Boston
ఆమెరికాలో ప్రవాసాంధ్రుడు మృతి
author img

By

Published : Apr 4, 2023, 12:24 PM IST

AP Man Died In America : దేశం కానీ దేశం.. తన మిత్రుడు వస్తున్నాడనే సంతోషం.. ఆ వ్యక్తిలో ఎంతోసేపు నిలవలేదు. భారత్ నుంచి ఆమెరికా వస్తున్న తన మిత్రుడి కోసం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అమెరికాలోని బోస్టన్‌ లోగన్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. మార్చి 28వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన విశ్వచంద్​ కోళ్లగా ఆమెరికా పోలీసులు తెలిపారు. ఆతను అమెరికాలో డేటా అనలిస్ట్‌గా టకెడ ఫార్మాస్యూటికల్‌ సంస్థలో పని చేస్తున్నారు.

భారత్​ నుంచి తన మిత్రుడైన ఓ సంగీత వాయిద్య కళాకారుడు అమెరికా వస్తున్నాడని.. అతనిని పికప్​ చేసుకోవటానికి విశ్వచంద్​ విమానాశ్రయానికి వెళ్లాడు. తన సొంత వాహనంలో విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయం బయట వేచిచూస్తున్న సమయంలో.. అతని వైపుగా వచ్చిన ట్రాన్స్​పోర్ట్​కు చెందిన వాహనం.. అతని వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమీపంలోనే ఉన్న ఓ నర్సు ఘటనను గమనించింది. వెంటనే స్పందించి విశ్వచంద్​ను కారు నుంచి బయటకు తీసి పరీక్షించగా.. అప్పటికే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం డార్ట్‌మౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందినదిగా గుర్తించారు. అక్కడున్న స్థానికులు డార్ట్‌మౌత్‌ వాహనాన్ని నడిపిన మహిళా డ్రైవర్​ను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న మస్సాచుసెట్స్‌ పోలీసులు మహిళా డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది.

ప్రమాదానికి కారణమైన ట్రాన్స్​పోర్టు వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. మరో వాహనంలో పపించివేశారు. ఈ ప్రమాద వివరాలు తెలుసుకున్న సదరు ట్రాన్స్​పోర్టు సంస్థ విచారం వ్యక్తం చేసింది. పోలీసుల విచారణకు సహకరిస్తామని డార్ట్‌మౌత్‌ కంపెనీ తెలిపింది. ఇది ఇలా ఉండగా విశ్వచంద్​ విధులు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ ప్రమాద వివరాలను మృతుని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆతని కుటుంబసభ్యులకు అండగా ఉంటామని పేర్కొంది. నిబద్ధత కలిగిన ఉద్యోగిని కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది.

విశ్వచంద్​ కుటుంబానికి అతని మిత్రులు, బంధువులు ఆర్థిక సాయం ప్రకటించారు. వారు ‘గో ఫండ్‌ మి’ అనే పేరుతో వెబ్​పేజీని రూపొందించారు. దాని ద్వారా ఇప్పటివరకు వచ్చిన 4 లక్షల 6 వేల 151 అమెరికన్​ డాలర్లను.. బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.