ETV Bharat / state

AP High Court Hearing on House Arrest Petition of TDP Leaders: టీడీపీ నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - TDP Leaders House Arrest Petition news

AP High Court Hearing on House Arrest Petition of TDP Leaders: టీడీపీ నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారలో భాగంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. గృహనిర్బంధం చట్టవ్యతిరేకమైన చర్యని, సుప్రీంకోర్టు నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు.

High_Court_Hearing_on_TDP_Leaders_Petition

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2023, 8:36 PM IST

AP High Court Hearing on House Arrest Petition of TDP Leaders: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ.. నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడంపై.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరపు న్యాయవాది వై. బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

Protests Over Illegal Arrest of Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. గతకొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడమే కాకుండా, ముఖ్యనేతలను గృహనిర్బంధాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల గృహనిర్బంధాలపై ఆ పార్టీ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై నేడు న్యాయస్థానంలో విచారణ జరిగింది.

TDP Protests Across Andhra Pradesh: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. 'బబుతో నేను అంటూ' నిరసనలు

Advocate Balaji Arguments: పిటిషనర్ తరపు న్యాయవాది వై.బాలాజీ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం చట్టవ్యతిరేకమైన చర్య అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21కి విరుద్ధమన్న న్యాయవాది.. సుప్రీంకోర్టు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలిపారు. అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ.. ప్రతిపక్షాలకు అనుమతులను నిరాకరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

TDP fire on YCP government : 'చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలన్నదే జగన్ లక్ష్యం..' 'అరెస్టు పిరికిపంద చర్య' : టీడీపీ నేతల ఆగ్రహం

High Court Orders to the State Home Ministry: ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాలు సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో న్యాయవాదులు వాదోపవాదాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. సీఎస్, డీజీపీ, రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ.. ఉత్తర్వులిచ్చింది.

Hearing in High Court on Chandrababu petition: మరోవైపు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేసి.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించటాన్ని సవాల్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఈనెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. దాంతోపాటు ఈనెల 18 వరకు సీఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ జరపవద్దని విజయవాడలోని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 19 కి వాయిదా వేసింది.

Rajinikanth Phone Call to Lokesh : తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు: రజనీకాంత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.