ETV Bharat / state

ఏపీ ఫైబర్‌నెట్​కి వినియోగదారులు దూరం.. కారణం..?

AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌ లక్ష్యం నీరుగారుతోంది. పేదలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌, కేబుల్‌ ప్రసారాలు, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సేవలు చౌకగా అందించాలన్న సర్కారు సంకల్పం ఆవిరైపోతోంది. కొత్త బాక్సులు ఇవ్వకపోవడంతో పాటు ఉన్నవీ మరమ్మతులకు నోచుకోక కనెక్షన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఫలితంగా సంస్థ పీకల్లోతు నష్టాల్లోకి జారిపోయింది.

FIBER
ఏపీ ఫైబర్‌నెట్‌
author img

By

Published : Feb 17, 2023, 9:21 AM IST

Updated : Feb 17, 2023, 11:36 AM IST

ఏపీ ఫైబర్‌నెట్​కి వినియోగదారులు దూరం.. కారణం..?

AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌ పరిస్థితి మేడిపండు చందంలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 70 వేల కనెక్షన్లకు సేవలందిస్తున్నట్లు సంస్థ యాప్‌లో చూపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 5 లక్షల కనెక్షన్లే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించడాని మూడేళ్లలో బేసిక్‌ ప్యాకేజీ ధరను 235 రూపాయల నుంచి 350 రూపాయలకు రెండు దఫాల్లో పెంచింది. అయినా నష్టాలు తగ్గకపోగా కనెక్షన్ల సంఖ్య సగానికి సగం తగ్గింది. దీనివల్ల సంస్థ మొత్తం నష్టాలు 250 కోట్లకు చేరాయి. పాడైన బాక్సులకు మరమ్మతులు చేయించకపోవడమే కనెక్షన్లు తగ్గడానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీనివల్ల పేదలకు ఇంటర్నెట్‌, కేబుల్‌ ప్రసారాలను చౌకగా అందించాలన్న సంకల్పం నీరుగారుతోంది.

మూతపడ్డ సర్వీసు కేంద్రాలు: ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా 10 లక్షల ట్రిపుల్‌ ప్లే బాక్సులను 2016 నుంచి సంస్థ అందించింది. అప్పట్నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త బాక్సూ ఇవ్వలేదు. పాడైన బాక్సులను బాగు చేయడానికి ఏజెన్సీలు లేవు. దీనివల్ల ఐదు లక్షల బాక్సులను మూలనపడేశారు. ఐదు లక్షల కనెక్షన్లకే కేబుల్‌ సేవలు ఇస్తున్నట్లు ఆపరేటర్ల సంఘం నేతలు చెప్పారు. సంస్థ నెట్‌వర్క్‌ ఆధారంగా 50 లక్షల మందికి కేబుల్‌ ప్రసారాలను అందించొచ్చు. కనెక్షన్ల సంఖ్యను, కొత్త బాక్సులు కొని పెంచుకుంటామని సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి ప్రకటించినా ఒక్క కొత్త కనెక్షన్‌ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్‌ బాక్సుల్లో చిన్నచిన్న సమస్యలు రావడం సహజం. కానీ మరమ్మతులు చేసే ఏజెన్సీలను సంస్థ ఏర్పాటు చేయలేదు. డాసన్‌ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయడంతో సర్వీసు కేంద్రాలు మూతపడ్డాయి. ప్రతి నగరంలో సర్వీసు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పినా ఎక్కడా అమలు కాలేదు. ఇటీవల విజయవాడ, విశాఖపట్నంలో రెండు కేంద్రాలను ఏర్పాటుచేసినా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో నిర్వాహకులు మూసేశారు.

మండిపడుతున్న వినియోగదారులు: బాక్సుల కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రతి నెలా 59 రూపాయల వంతున ఎనిమిదేళ్లు వసూలు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కలిపి బేసిక్‌ ప్యాకేజీని 235గా నిర్దేశించింది. ఇప్పటికే సుమారు అయిదేళ్లు చెల్లించారు. అలాంటిది ఇప్పుడు 350 రూపాయలకు రెండు దఫాల్లో పెంచారు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. సంస్థ యాప్‌లో ఆపరేటర్‌ పేరిట ఉన్న కనెక్షన్లను గడువు సమయంలో ఉపయోగించేవారు రీచార్జ్ చేసుకోకపోతే రోజుకు రెండు రూపాయల ఫైన్ తీసుకునే పద్దతిని సంస్థ తీసుకు వచ్చింది. వినియోగదారులు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని ఆపరేటర్‌ చెల్లించాల్సి వస్తోంది. బాక్సులు పాడైనా, కనెక్షన్ల సంఖ్య తగ్గించడం లేదు. యాప్‌లో ఆపరేటర్‌ పేరిట ఉన్న కనెక్షన్లను అలాగే చూపుతూ వాటికీ నెలకు 59 రూపాయల వంతున మినహాయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉండేవారు మరోచోటుకు వెళ్లేటప్పుడు బాక్సులను తిరిగి ఇవ్వలేదు. వేరే ప్రాంతంలో బాక్సు ఉపయోగించాలంటే మళ్లీ కోడ్‌ నెంబర్ మార్చుకోవాలి. ఇలా చాలాచోట్ల బాక్సులను పక్కన పడేశారు. ఇలాంటి వాటి అద్దెనూ ఆపరేటర్ల దగ్గర నుంచి సంస్థ వసూలు చేస్తోంది.

జగన్ అధికారంలోకి వచ్చాక: గత ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ ద్వారా తక్కువ ధరకు ఎక్కువ స్పీడ్‌ ఇంటర్నెట్‌,ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌, కేబుల్‌ సేవలు అందించేందుకు ప్రయత్నం చేసింది. దీనికోసం 10 లక్షల ఓఎల్‌టీ బాక్సులు కొనుగోలు చేసి ఆ ఖర్చును వినియోగదారుల నుంచి ప్రతినెలా ఛార్జీలతో కలిపి వసూలు చేసింది. నెల రోజుల్లో సుమారు 9 లక్షల 60 వేల కనెక్షన్లు వచ్చాయి. పాడైపోయిన బాక్సులు బాగుచేసేందుకు జిల్లాల్లో సర్వీసు సెంటర్లను పెట్టింది. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఫైబర్‌నెట్‌ సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడేలా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆపరేటర్లు కూడా నష్టాల పాలవుతున్నారు. ఫైబర్‌నెట్‌ ద్వారా తీసుకున్న కనెక్షన్ల బాక్సులు పాడవడం, కొత్తవీ ఇవ్వకపోవడం వల్ల వినియోగదారులు ప్రైవేటు సేవలకు వెళ్తున్నారని రాష్ట్ర కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నేతలు వాపోతున్నారు. యాప్‌లో చూపుతున్న కనెక్షన్ల సంఖ్యకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదంటున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 17, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.