Electricity Employees Demands: ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, జెన్కో డిస్కంలలో పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా 23,548 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో వీరందరినీ రెగ్యులర్ చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆయన పేర్కొన్నారు.
రెగ్యులర్ విషయమై మేము యాజమాన్యాన్ని అడిగిన సమయంలో.. అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని మొన్నటి వరకూ చెప్పేవారని ఆయన అన్నారు. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు వేల మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని ప్రకటించిందన్న ఆయన.. మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 2014 జూన్ నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇలా చేయటం సబబు కాదని ఆయన అన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నా.. వారికి వేతనాలు ఇతర సౌకర్యాలు సమానంగా కల్పించడం లేదని ఆయన తెలిపారు. పీస్ రేట్ కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలన్న ఆయన.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ పరికరాలను కల్పించి.. మరణించిన వారికి 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని బాలకాశి హెచ్చరించారు.
"రాష్ట్రంలో విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, జెన్కో డిస్కంలలో పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా 23,548 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వీరందరినీ రెగ్యులర్ చేస్తానని స్పష్టంగా హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. రెగ్యులర్ విషయమై మేము యాజమాన్యాన్ని అడిగిన సమయంలో.. అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని చెప్పేవారు. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడు వేల మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ పరికరాలను కల్పించాలి. మరణించిన వారికి రూ. 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. మా సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె బాట పడతాం" - బాలకాశి, యునైటెడ్ ఎలక్ట్రిసిటి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: