ETV Bharat / state

CM REVIEW ON SIPB: అన్ని రకాల పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే: సీఎం జగన్‌ - Andhra Pradesh govt news

CM Jagan Key instructions issued to SIPB officers: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు తాడేపల్లిలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(SIPB) సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం పలు సంస్థలిచ్చిన ప్రతిపాదనలపై ఎస్‌ఐపీబీ (SIPB) ఆమోద ముద్ర వేసింది.

CM REVIEW
CM REVIEW
author img

By

Published : Jul 11, 2023, 9:31 PM IST

Updated : Jul 12, 2023, 1:16 PM IST

అన్ని రకాల పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే

CM Jagan Key instructions issued to SIPB officers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(SIPB) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డితోపాటు పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమల ఏర్పాటుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి.. పలు సంస్థలిచ్చిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేశారు.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.. తాడేపల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం జగన్.. SIPB అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు సహా అన్ని రకాల పరిశ్రమల్లో.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చేసిన చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించారు. చట్టం అమలు జరుగుతోన్న తీరుపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి ఆరు నెలలకొకసారి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసే సంస్థలు ఏవైనా.. కనీస మద్దతు ధరకు తప్పక కొనుగోలు చేయాల్సిందేనని.. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పలు ప్రాజెక్టులకు SIPB ఆమోద ముద్ర.. అనంతరం వైఎస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం అశోక్‌ నగర్, బక్కన్నవారి పల్లె వద్ద జేఎస్‌డబ్ల్యూ (JSW) నియో ఎనర్జీకి చెందిన హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు.. SIPB ఆమోదం తెలిపింది. హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ అనుబంధ సంస్థ క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ.. 2,450 కోట్లతో ప్రతిపాదించిన సోలార్, పవన విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు విశాఖ జిల్లా అన్నవరంలో రూ.525 కోట్ల పెట్టుబడితో మేఫెయిర్‌ హోటళ్లు, రిసార్టులు ఏర్పాటుకు, తిరుపతి పేరూరు వద్ద రూ.218 కోట్లతో.. హయత్‌ హోటల్‌ నిర్మాణానికి, విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద..రూ.1200 కోట్లతో హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుకు SIPB ఆమోద ముద్ర వేసింది.

తిరుపతిలో కోకో బటర్, పౌడర్, మాస్ తయారీ.. అంతేకాకుండా, తిరుపతి జిల్లా కువ్వకోలి వద్ద రూ.400 కోట్లతో.. సీసీఎల్‌ పుడ్‌, బెవరేజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటునకు SIPB సమ్మతించింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్‌ ఆగ్రో రిసోర్స్‌ లిమిటెడ్‌ రూ.230 కోట్లతో ప్రతిపాదించిన.. ఎడిబుల్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటునకు అంగీకారం తెలిపింది. తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద రూ.168 కోట్లతో కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటునకు కూడా SIPB పచ్చజెండా ఊపింది.

కంపెనీలు ఏవైనా సరే..రైతులకు మద్దతు ధర ఇవ్వాలి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక పరిశ్రమ ఏర్పాటు సమర్థవంతంగా నడవాలంటే ఆ ప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరమన్నారు. అందుకే ప్రభుత్వం ఏర్పడగానే చట్టం తీసుకు వచ్చామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమల్లో, నిర్మాణంలో ఉన్న పరిశ్రమల్లో, రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు.. స్థానికులకే ఇవ్వాలని అధికారులకు సూచిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సరిపడా మానవ వనరులు ఉన్నాయన్న జగన్.. నైపుణ్యాభివృద్ధికి కొదవలేదన్నారు.

''కంపెనీలు ఏవైనా సరే.. రైతుల నుంచి పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలి. పరిశ్రమల శుద్ధికి.. డీ శాలినేషన్‌ నీటినే వినియోగించాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ.. తాగునీటికీ, వ్యవసాయానికీ మంచినీటి కొరత రాకుండా చూడాలంటే.. డీ శాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లభ్యమయ్యే నీటిని పరిశ్రమలకు ఇవ్వండి. వీటిపై కలెక్టర్లు, అధికారులు, ఆయా శాఖల మంత్రులు తగిన చర్యలు తీసుకోండి.''-వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

Last Updated : Jul 12, 2023, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.