Anganwadi Workers Protest in AP : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె పదో రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా కొనసాగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్వాడీలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మైలవరం ఎమ్పీడీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకని వినూత్నంగా నిరసన తెలియజేశారు. జగనన్న డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొండి వైఖరిని వదిలి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీఎం జగన్‌ని కొత్తగా ఏమీ కోరడం లేదని,గతంలో ఇచ్చిన హామీనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు.
Anganwadi Workers Problems in AP : కృష్ణా జిల్లా కంకిపాడులోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట పొర్లు దండాలు పెట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతూ తమ ఆకాంక్షలను చాటి చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన ఆపేది లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్డీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని ఆందోళన చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లాలోని మంగళగిరిలో భారీ ర్యాలీ తీసి అనంతరం దుకాణాల్లో భిక్షాటన చేశారు.
ఇది సరైన సమయం కాదు - అంగన్వాడీల డిమాండ్లపై మంత్రి ఉషశ్రీ చరణ్
Anganwadi Agitation Statewide : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు కూడలిలో రహదారికి ఇరువైపులా నిల్చుని ఆందోళన చేశారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుంచి చర్చి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.
Anganwadi Workers Problems Increase in YSRCP Government : అన్నమయ్య జిల్లా మదనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ఓ అంగన్వాడీ కార్యకర్త గ్రామ దేవత వేషధారణతో వినూత్న నిరసన తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు పాపాగ్ని నదిలో నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం
Anganwadi Staff Situations in AP : నంద్యాల తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ప్రధాన రహదారిపై మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ తిని సంబరాలు చేసుకుంటూ, తమకు గడ్డి తినిపిస్తున్నాడని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డోన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.
CM Jagan Cheating Anganwadi Workers : కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మానవహారం చేపట్టారు. విశాఖలో అంగన్వాడీలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకుని తర్వాత మానవహారం నిర్వహించారు.
ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అంగన్వాడీ కార్యకర్తలు