ETV Bharat / state

ఏపీ పరిశ్రమల బాటలో.. ఏపీఎండీసీ.. దేశవ్యాప్తంగా రోడ్ షో నిర్వహణ కోసం ప్రణాళికలు - ఏపీఎండీసీ

Andhra Pradesh Mineral Development Corporation Road Show : ఏపీ పరిశ్రమల శాఖ బాటలో నడిచేందుకు.. రాష్ట్ర గనుల విభాగం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇటీవల రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు.. జీఐఎస్ పేరుతో, పరిశ్రమల శాఖ దేశవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అదే బాటలో.. రాష్ట్రంలో మైనింగ్ ఉన్న అపార అవకాశాలపై పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు, రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ రోడ్డు షోలను నిర్వహించేదంకు సిద్దమవుతోంది.

Andhra Pradesh Mineral Development Corporation Road Show
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ రోడ్ షో
author img

By

Published : Feb 23, 2023, 10:05 AM IST

Updated : Feb 23, 2023, 10:25 AM IST

Andhra Pradesh Mineral Development Corporation Road Show In All Over India : ఏపీలో చిన్న మొత్తంలో ఉన్న ఖనిజాల మైనింగ్ కోసం.. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ రోడ్ షోలను నిర్వహిస్తోంది. ఇప్పటికే, ఇలాంటి రోడ్ షోలను ఏపీ పరిశ్రమల శాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. బెంగుళూరు, చెన్నై, ముంబాయిలలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ షోలను నిర్వహించింది. ఇదే కోవలో ఇప్పుడు ఏపీఎండీసీ కూడా రోడ్ షో లను నిర్వహించి, మైనింగ్ అభివృద్ది కోసం.. పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలని భావిస్తోంది. అందుకోసం బుధవారం చెన్నైలో ఓ రోడ్ షో నిర్వహించింది.

ఏపీలో ఉన్న అపారమైన ఖనిజాలను వెలికి తీసేందుకుగానూ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ.. బుధవారం చెన్నైలో నిర్వహించిన రోడ్ షో కు అధికారులు పెద్ద ఎత్తున హజరయ్యారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గనులపై ఇ - ఆక్షన్ నిర్వహిణపై, ఔత్సాహిక పెట్టుబడుదారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో విస్తృతంగా అందుబాటులో ఉన్న గ్రానైట్, క్వార్డ్జ్, సిలికా శాండ్, డోలమైట్, రోడ్ మెటల్, గ్రావెల్ తదితర చిన్న తరహా ఖనిజాల మైనింగ్ పై ఆసక్తి ఉన్న వారిని ఈ రోడ్ షోలకు ఆహ్వానిస్తున్నట్టు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) స్పష్టం చేసింది. ఫిక్కి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఈ రోడ్ షోకు 200 మంది ఔత్సాహికులు హాజరైనట్టు గనుల శాఖ తెలిపింది. ఈ తరహాలోనే మరో మూడు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించాలని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది.

చిన్న తరహా ఖనిజ నిల్వలు .. ఇ-ఆక్షన్ ద్వారా గనులను వేలం .. ఎండీ వీజి వెంకట రెడ్డి స్పష్టం : ఏపీలో దాదాపుగా 6 వేల హెక్టార్ ల ప్రాంతంలో చిన్న తరహా ఖనిజ నిల్వలు ఉన్నట్టు ఏపీఎండీసీ ఎండీ వీజి వెంకట రెడ్డి స్పష్టం చేశారు. గతంలో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానం అనుసరించే వారమని ప్రస్తుతం దీనిలో మార్పులు చేస్తూ ఇ-ఆక్షన్ ద్వారా గనులను వేలం వేస్తున్నట్టు తెలిపారు. ఏపీలో సులభతరమైన మైనింగ్ విధానం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 25 న హైదరాబాద్, 27 వ తేదీన భువనేశ్వర్, మార్చి 2 వ తేదీన బెంగుళూరులో రోడ్ షోలను నిర్వహిస్తున్నట్టు ఏపీఎండీసీ ఎండీ వీజి వెంకట రెడ్డి వివరించారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 23, 2023, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.