AP HIGH COURT: హైకోర్టు పేరుతో ఓ కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ గుర్తించామని హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపర్తి గిరిధర్ తెలిపారు. దీనిపై రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి అలాంటి సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ని హైకోర్టు జారీ చేయలేదని వెల్లడించారు. ఈ కల్పిత సర్క్యులర్‌పై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగాళ్లు చెప్పే మాటలను నమ్మవద్దని ఆయన సూచించారు.
అభ్యర్థులను ప్రభావితం చేసేలా.. రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై వ్యాఖ్యలు చేయటం, పేర్లను ప్రస్తావించి డబ్బులు చెల్లించాలని కోరే వారిపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు. ఏదైనా తప్పుడు వార్తలు, సమాచారం పోస్ట్ చేయడం, ప్రచారం చేసే వారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్, పరీక్ష తేదీ-స్థలం, మార్కుల జాబితా, ప్రొవిజనల్ తదితర వివరాలకై హైకోర్టు అధికారిక వెబ్సైట్ https://hc.ap.nic.in ను సందర్శించాలని హైకోర్టు సూచించిందన్నారు. నకిలీ రిక్రూట్‌మెంట్, నకిలీ లెటర్‌లపై సమాచారం అందితే హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ కోరారు.
ఇవీ చదవండి: