ETV Bharat / state

GPF funds: ప్రభుత్వ భిక్ష కాదు.. జీపీఎఫ్ నిధుల విడుదలపై సూర్యనారాయణ ఆగ్రహం - AP Govt Employees Union news

AP Govt Employees Union President comments: రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము (జీపీఎఫ్) విషయంలో ప్రభుత్వం, కొంతమంది పెద్దలు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ముట్టుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, అది ప్రభుత్వ భిక్ష కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

AP Govt
AP Govt
author img

By

Published : Apr 28, 2023, 3:26 PM IST

Updated : Apr 28, 2023, 4:50 PM IST

AP Govt Employees Union President comments: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీపీఎఫ్ నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కొంతమంది పెద్దలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును ముట్టుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, అది ప్రభుత్వ భిక్ష కాదని ఆయన గుర్తు చేశారు. జీపీఎఫ్ నిధులను విడుదల చేసి, దానిని ఉద్యోగులకు తిరిగి చెల్లించి ఏదో మేలు చేసినట్టుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించిన ఆయన.. అది ప్రభుత్వం అనుగ్రహం కాదు, దయ కాదు, భిక్ష కాదు.. అది తమ సొమ్ము, హక్కు, దానిని ముట్టుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మార్చి 12వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జీఎల్ఐ క్లెయిమ్‌ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు పేర్కొంది. ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులను క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ రూ.3 వేల కోట్లను వెచ్చించిందని.. నెలాఖరు (మార్చి)లోపు చెల్లిస్తామని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జీపీఎఫ్‌తోపాటు ఇతర పెండింగ్ బిల్లులను కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో జీపీఎఫ్ నిధుల విడుదలపై ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారంపై ఈరోజు ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

జీపీఎఫ్ అనేది ప్రభుత్వ భిక్ష కాదు..అది మా హక్కు

''గత నెలలో ప్రభుత్వం.. కొన్ని ఎంపిక చేసిన ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ క్లెయిమ్స్ ఏమైతే ఉన్నాయో.. వాటిలో కొన్నింటికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పెద్దలకు వినమ్రంగా ఒక విషయాన్ని చెప్తున్నాను. అయ్యా.. అది మీ అనుగ్రహం కాదు.. మీ దయ కాదు.. మీ భిక్ష కాదు.. అది మా సొమ్ము, మా హక్కు, అసలు దాన్ని ముట్టుకునే హక్కు రాజ్యాంగం మీ శాసన వ్యవస్థకు కూడా అధికారం ఇవ్వలేదు'' అని ఆయన అన్నారు.

అనంతరం ప్రభుత్వానిది ఒక బ్యాంకు నిర్వహించే పాత్ర మాత్రమే ఉంటుందని సూర్య నారాయణ గుర్తు చేశారు. అలాంటిది ప్రభుత్వం ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాల నుంచి ఎలా సొమ్ము తీసుకుంటారని ప్రశ్నించారు. 2022 మార్చి నెలలో ఉద్యోగుల ఖాతాల నుంచి వందల కోట్లు తీసేసుకున్నారని మండిపడ్డారు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం.. ఇది నేరమని వెల్లడించారు. దీనిపై అకౌంటెంట్ జనరల్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశామన్నారు. 2022 జూన్‌లో ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఉద్యోగుల గుర్తింపు కోసం రూపొందించిన రోసా నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు అన్నారు. పీఆర్సీ సహా వివిధ ఆర్ధిక అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించాలని, కానీ దానికి విరుద్ధంగా ఎలాంటి అర్హత లేని జెఏసీలను, ఫెడరేషన్‌లను చర్చలకు పిలుస్తోందని విమర్శించారు. జేఏసీలను అధికారికంగా, అనధికారికంగా ఎలా చర్చలకు పిలుస్తారని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని చర్చలకు పిలువ లేదన్నారు. ఉద్యోగ సంఘాల మధ్య ఇలాంటి వివక్ష ప్రభుత్వమే ప్రోత్సహించడం శ్రేయస్కరం కాదని జి.ఆస్కార్‌రావు వెల్లడించారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 28, 2023, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.