Achchennaidu comments on Peddireddy: రాష్ట్రంలో ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి విపరీత పోకడల్ని డీజీపీ నివారించాలని డిమాండ్ చేశారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదన్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి 30 యాక్టు నోటీసు ఇవ్వడం అధికార దుర్వినియోగమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల కోడి పందేలు, జూదాలు జరుగుతున్నా.. పోలీస్ యాక్టు 30 ఏమైందని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ప్రజల్ని భయపెట్టి లాండ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ కుంభకోణాలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి చేసే అక్రమాలు బయటపడతాయనే భయంతోనే దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ జోక్యం చేసుకొని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: