ETV Bharat / state

విదేశాలలోని పూర్వ విద్యార్థులు సహకారమందించాలి: గవర్నర్ బిశ్వభూషణ్

ANU Alumni Association Website and Logo: విద్యాసంస్ధల ఉన్నతికి పూర్వ విద్యార్ధులు తమ శక్తిమేర సహకరించి విద్యాదానంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం వెబ్​సైట్, లోగోను ఆవిష్కరించారు. త్వరలో జరగబోయే పూర్వ విద్యార్థుల మెగా సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రికను కూడా విడుదల చేశారు.

governor Biswabhusan Harichandan
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
author img

By

Published : Dec 29, 2022, 4:47 PM IST

ANU Alumni Association Website and Logo:: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం వెబ్​సైట్, లోగోను రాజ్​భవన్ వేదికగా గవర్నర్ ఆవిష్కరించారు. త్వరలో జరగబోయే పూర్వ విద్యార్థుల మెగా సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రికను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పలు విద్యాసంస్ధలలో ఇప్పటికే పూర్వవిద్యార్ధుల సంఘాలు క్రియాశీలకంగా.. పలు కార్యక్రమాలు చేపడుతున్నాయని, అదేరీతిన నాగార్జున విశ్వవిద్యాయలం సంఘం కూడా మంచి పనితీరును కనబరచాలని ఆకాంక్షించారు.

విద్యా సంస్ధలలో భవన నిర్మాణం మొదలు, పేద విద్యార్ధులకు సహాయం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా విదేశాలలో స్ధిరపడిన పూర్వవిద్యార్ధులు తగిన సహకారం అందించాలని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తీసుకుంటున్న విభిన్న కార్యక్రమాల గురించి.. విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ గవర్నర్‌కు వివరించారు. ముఖ్యంగా పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి గవర్నర్​కు విశదీకరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.